అది కాదు ఇదీ అసలు పాఠం- అమిత్ షా వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్ ..
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో మరోసారి అధికారం నిలబెట్టుకునేందుకు బీజేపీ సర్వశక్తులొడ్డుతోంది. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తాజాగా 2002లో జరిగిన గోద్రా అనంతర అల్లర్లను తెరపైకి తెచ్చారు. 2002లోనే సంఘ విద్రోహశక్తుల్ని అణచివేసి గుజరాత్ దేశానికి ఓ పాఠం నేర్పిందంటూ అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటిపై కాంగ్రెస్ సహా విపక్షాలు మండిపడుతున్నాయి. ఇదే క్రమంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందించారు.
2002లోనే గుజరాత్ పాఠం నేర్పామన్న అమిత్ షా కామెంట్స్ పై అసదుద్దీన్ ఓవైసీ మండిపడ్డారు. గుజరాత్ లో ముస్లింలు అధికంగా ఉండే జుధాపురలో ఎంఐఎం అభ్యర్ధులకు మద్దతుగా ప్రచారంలో పాల్గొన్న ఓవైసీ.. అమిత్ షా వ్యాఖ్యలకు ఘాటు కౌంటర్ ఇచ్చారు.

అమిత్ షా 2002లో అల్లర్లు చేసిన వారికి పాఠం నేర్పడం ద్వారా గుజరాత్ లో శాంతి నెలకొల్పినట్లు చెప్పుకుంటున్నారని, కానీ మీరు నేర్పిన పాఠం బిల్కిస్ బానో రేపిస్టుల్ని వదిలేయడమని, ఆమె మూడేళ్ల కూతుర్ని పొట్టనపెట్టుకున్న హంతకుల్ని వదిలేయడమేనని, కాంగ్రెస్ ఎంపీ ఎహ్ సాన్ జాఫ్రీ హత్య చేయడం ఓ పాఠమని చెప్పినట్లుందన్నారు.
2002లో గుజరాత్ లోని గుల్బర్గా సొసైటీ హత్యాకాండను కూడా ఓవైసీ ప్రస్తావించారు. మీ పాఠాలు ఎన్నని గుర్తుపెట్టుకోమంటారు అమిత్ షా ? తప్పు చేసిన వారికి అనుకూలంగా తీర్పులిప్పించడం ద్వారా శాంతిని నెలకొల్పారా అని ఓవైసీ సూటిగా ప్రశ్నించారు. అధికారం రాగానే ప్రజలు మరచిపోతారని, ఎప్పుడూ ఎవరితోనూ ఉండలేదన్నారు.

అధికారం ఎప్పటికీ ఎవరి దగ్గరా ఉండదని, ఏదో ఒక రోజు అధికారం అందరి నుంచి లాగేసుకుంటారని అమిత్ షాకు గుర్తుచేశారు. అధికారం మత్తులో ఈరోజు హోంమంత్రి.. మేం గుణపాఠం చెప్పామని చెబుతున్నారు.. ఏం గుణపాఠం చెప్పావు.. దేశం మొత్తం మీద పేరు తెచ్చుకున్నారన్నారు. ఢిల్లీలో మతకల్లోలాలు జరిగాయని మీరు ఏ పాఠం నేర్పారని ప్రశ్నించారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications