ఆశారాం బాపు నా భర్త: కోర్టు వద్ద మహిళ అరుపులు
జోధ్‌పూర్: నకిలీ బాబా ఆశారాం బాపు విషయంలో వింత సంఘటన చోటు చేసుకుంది. లైంగిక దాడి కేసులో అరెస్టయిన ఆశారాం బాపును సోమవారం కోర్టుకు తీసుకుని వచ్చినప్పుడు ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆశారాం తన భర్త అంటూ ఓ మహిళ కోర్టు వద్ద కేకలు పెట్టింది.
ఓ మహిళ కోర్టు అవరణలోకి వచ్చి ఆశారాం తన భర్త అంటూ కేకలు వేయడం ప్రారంభించిందని, ఆశారాం రాజస్థాన్‌లోని నాగౌర్ జిల్లా లద్నూ ప్రాంతంలో తనను వివాహం చేసుకున్నాడని ఆమె అన్నట్లు చెబుతున్నారు.

ఆ మహిళను పోలీసులు బయటకు తీసుకుని వెళ్లారు. అయితే, ఆశారాం ఆమె మాటలను ఖండించారు. కాగా, ఆశారాంపై పెట్టిన అత్యాచారం కేసుపై విచారణను కోర్టు ఓ రోజుకు వాయిదా వేసింది. నిరుడు ఆగస్టు 15వ తేదీన జోధ్‌పూర్‌లోని తన ఆశ్రమంలో 15 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం చేసినట్లు కేసు నమోదైన విషయం తెలిసిందే.
ఆ కేసులో విచారణ సోమవారం ప్రారంభమైంది. ఎఫ్ఐఆర్ పెట్టడానికి సాక్ష్యంగా భావిస్తున్న వీడియో క్లిప్పును బయటపెట్టాలనే డిమాండ్‌ను బాధితురాలి తరఫు న్యాయవాది వ్యతిరేకించారు. వీడియో క్లిప్పును బయటపెడితే బాధితురాలు ఎవరనేది తెలుస్తుందని ఆయన అన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications