100 అశ్లీల వీడియోలు, రూ. 1500 కోట్లు.. ఓ దొంగ బాబా!
మహారాష్ట్రలో సంచలనం సృష్టిస్తున్ననాసిక్ 'నకిలీ బాబా' అశోక్ ఖరాత్ ఉదంతం ఇప్పుడు రాజకీయ రంగు పులుముకుంది. అత్యాచార కేసులో అరెస్టయిన ఈ స్వయం ప్రకటిత గాడ్‌మ్యాన్ గురించి విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. దొంగ బాబా అశోక్ ఖరాత్‌కు చెందిన నాసిక్ జిల్లాలోని "శ్రీ ఈశాన్యేశ్వర దేవస్థాన్ ట్రస్ట్"కు 2018లో అప్పటి మహారాష్ట్ర సర్కారు రూ.1.05 కోట్ల నిధులను మంజూరు చేసినట్లు అధికారిక పత్రాల ద్వారా వెల్లడైంది. ప్రాంతీయ పర్యాటక అభివృద్ధి పథకం కింద ఆలయ ప్రాంగణంలో హాల్ నిర్మాణం, పార్కింగ్, భక్తుల బస, మరుగుదొడ్ల సౌకర్యాల కోసం ఈ నిధులను కేటాయించారు. అప్పట్లో పర్యాటక శాఖ మంత్రిగా ఉన్న బీజేపీ జైకుమార్ రావల్ హయాంలో ఈ నిధుల మంజూరు జరిగింది.
విచారణలో వెలుగులోకి రూ.1500 కోట్ల సామ్రాజ్యం
ఓ సామాన్యుడిగా జీవితాన్ని మొదలుపెట్టిన అశోక్ ఖరాత్.. గడిచిన కొన్నేళ్లలో ఏకంగా రూ.1500 కోట్ల ఆస్తులను కూడబెట్టినట్లు సిట్ విచారణలో తేలింది. భారీగా భూములు, భవనాలు, విలాసవంతమైన వాహనాలు ఆయనకు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇప్పుడు ఆదాయపు పన్ను శాఖ కూడా రంగంలోకి దిగి ఆయన ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది.

100 అశ్లీల వీడియోలు
పోలీసుల తనిఖీల్లో అశోక్ ఖరాత్‌కు సంబంధించిన డిజిటల్ పరికరాల నుంచి సుమారు 100 అశ్లీల వీడియోలను స్వాధీనం చేసుకున్నారు. మూఢనమ్మకాల పేరుతో మహిళలను లోబర్చుకుని వారిపై లైంగిక దాడికి పాల్పడటమే కాకుండా.. ఆ దృశ్యాలను వీడియో తీసి బ్లాక్‌మెయిలింగ్ చేసేవాడని ఆరోపణలు వస్తున్నాయి. సైబర్ పోలీసులు ఈ వీడియోలను విశ్లేషిస్తున్నారు.
అత్యాచార కేసుతో బయటపడిన బండారం
35 ఏళ్ల మహిళ ఫిర్యాదుతో ఈ దొంగ బాబా బండారం బయటపడింది. మూడేళ్ల పాటు తనపై వరుసగా అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె పోలీసులను ఆశ్రయించింది. ఐపీఎస్ అధికారణి తేజస్వి సత్పుటే నేతృత్వంలోని సిట్(ప్రత్యేక దర్యాప్తు బృందం) ఇప్పటివరకు ఖరాత్‌పై ఆరు క్రిమినల్ కేసులు నమోదు చేసింది. ఈ దొంగ బాబా బాధితుల్లో ఓ గర్భిణీ స్త్రీ ఉండటం గమనార్హం.
రాజకీయ సంబంధాలు
అశోక్ ఖరాత్ ఆశ్రమానికి రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులు తరచూ వస్తుండేవారని విచారణలో తెలిసింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు కూడా అశోక్ ఖరాత్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో రాజీనామా చేయాల్సి వచ్చింది. రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని అశోక్ ఖరాత్ ఈ దందాను సాగించినట్లు తెలుస్తోంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ?












Click it and Unblock the Notifications