'జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను'.. సీఎం సంచలన వ్యాఖ్యలు
అసోం బీజేపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిన "పాయింట్ బ్లాంక్" (Point Blank) అనే వీడియోపై తీవ్ర దుమారం చెలరేగింది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే తాజాగా ఈ వీడియోపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ స్పందించారు. ఆ వీడియో గురించి తనకు తెలియదన్నారు. అలాగే తాను బంగ్లాదేశ్ చొరబాటుదారులను వ్యతిరేకిస్తున్నానని తెలిపారు.
ఇక ఆ వీడియోలో ముఖ్యమంత్రి శర్మ తుపాకీ పట్టుకుని, ముస్లింల వలె కనిపిస్తున్న వ్యక్తుల చిత్రాలపై గురిపెట్టినట్లు ఉంది. ఇందులో నో మెర్సీ, పాయింట్ బ్లాంక్ షాట్ వంటి లైన్స్ ను ఉపయోగించారు. తీవ్ర వ్యతిరేకత రావడంతో ఈ వీడియోను తర్వాత తొలగించారు. అయితే ఈ ఘటనపై ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసోం సీఎం హిమంత బిశ్వశర్మ పై హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. ఇక తాజాగా ఇదే అంశంపై హిమంత బిశ్వ శర్మ స్పందించారు.

'నేను జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాను. ఆయన నాపై కేసు పెడితే, నన్ను అరెస్టు చేయనివ్వండి' అని పేర్కొన్నారు. ఆ వీడియో గురించి తనకు తెలియదన్నారు. మరోవైపు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ కూడా ఈ వీడియోను తీవ్రంగా ఖండించాయి. ఇది హేయమైన చర్య అని అభివర్ణించాయి. కోర్టులు ఇందులో జోక్యం చేసుకోవాలని కోరాయి.












Click it and Unblock the Notifications