వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉగ్రవాదం జాతీయ సమస్య: పంజాబ్ సీఎం

|
Google Oneindia TeluguNews

అమృత్ సర్: గురుదాస్ పూర్ లో ఉగ్రవాదులు దాడులు చెయ్యడంతో పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పరోక్షంగా ఆయన కేంద్ర ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఉగ్రవాదుల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోంటామని అన్నారు.

పోలీస్ స్టేషన్ లో ఉగ్రవాదులు దాడులు చేసిన విషయం తెలుసుకున్న ఆయన తన కార్యక్రమాలు అన్ని రద్దు చేసుకున్నారు. అత్యవసరంగా డీజీపీ సుమేధి సింగ్ తో సహ ప్రభుత్వ ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారు.

 Asserting that militancy is a national problem, Punjab Chief Minister Parkash Singh Badal

వెంటనే డీజీపీ సుమేధి సింగ్ తో సహ అధికారులను దీనానగర్ వెళ్లాలని ఆదేశాలు జారీ చేశారు. తరువాత తీవ్రగాయాలై అమృత్ సర్ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం ప్రకాష్ సింగ్ బాదల్ మీడియాతో మాట్లాడారు.

ఉగ్రవాదం ఒక రాష్ట్ర సమస్య కాదని, దానిని ఎదుర్కోవడానికి జాతీయ విధానం కావాలని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వం పై మండిపడ్డారు. అంతర్జాతీయ సరిహద్దును ఎందుకు మూసి వెయ్యలేదని ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తో ఎప్పటికప్పుడు చర్చించి వివరాలు అందిస్తున్నామని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకాష్ సింగ్ బాదల్ అన్నారు.

English summary
punjab Chief Minister Parkash Singh Badal today said he would not allow to succeed any force inimical to the state's progress and disrupt its hard-earned peace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X