తాళికట్టే టైమ్ లో పెళ్లికూతురి బాయ్ ఫ్రెండ్ ఎంట్రీ, పెళ్లికొడుకు ఏం చేశాడంటే ? లైవ్ లో !
పెళ్లిలో జరగాల్సిన అన్ని కార్యక్రమాలు హిందూ సాంప్రధాయం ప్రకారం జరిగిపోయాయి. పెళ్లికూతురి మెడలో ఐదు నిమిషాల్లో పెళ్లికొడుకు తాళి కట్టాల్సి ఉంది. ఆ సమయంలో కల్యాణ మండపంలో సందడి సందడిగా ఉంది. ఆ సమయంలో సినిమా స్టైల్లో పెళ్లి పెటాకులు అయిన ఘటన కర్ణాటకలోని హాసన్ జిల్లా బేలూరు పట్టణంలో చోటుచేసుకుంది.
పెళ్లికూతురు ప్రేమికుడి ఎంట్రీతో బేలూరులోని ఒక్కలిగ సంఘం కల్యాణమండపంలో గురువారం జరగాల్సిన పెళ్లి రద్దయింది. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన చెందిన ఓ యువకుడికి బేలూరుకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. ఈ వివాహం గురువారం నిర్వహించాలని కుటుంబ సభ్యులు, బంధువులు, కుల పెద్దలు గత నెలలోనే నిర్ణయించారు. మార్చి 21వ తేదీన బేలూరులోని ఒక్కలిగ సంఘ కల్యాణమండపంలో వివాహ వేడకలు ఘనంగా మొదలైనాయి

వాస్తవానికి బుధవారం రాత్రి నుంచి హిందూ సాంప్రధాయం ప్రకారం యువతి, యువకుడి పెళ్లికి జరగాల్సిన అన్ని తతంగాలు జరుగుతున్నాయి. గురువారం వేకువ జామున పెళ్లికూతురు, పెళ్లికూతురికి నలుగులు పెట్టారు. ముహూర్తం బట్టలు కట్టుకున్న పెళ్లికొడుకు, పెళ్లికొడుకు పెళ్లిపీటల మీద కుర్చుకున్నారు. ఐదు నిమిషాల్లో పెళ్లికొడుకు అతనికి కాబోయే భార్య మెడలో తాళి కట్టాల్సి ఉంది. కళ్యాణ క్రతువులన్నీ ముగిసి కేవలం తాళి కట్టే కార్యక్రమం జరగాల్సి ఉంది.
పెళ్లికి వెళ్లిన అందరి చేతుల్లోకి అక్షింతలు కూడా ఇచ్చేశారు. ఆ సమయంలో హాసన్ జిల్లాలోని గవేనహళ్లిలో నివాసం ఉంటున్న నవీన్ అనే యువకుడు కల్యాణ మండపంలోకి ఎంట్రీ ఇచ్చి వెంటనే ఈ వివాహాన్ని నిలిపివేయండి అంటూ కేకలు వేశాడు. పెళ్లికొడుకుతో పాటు పెళ్లికి వెళ్లిన వాళ్లు నవీన్ హంగామా చూసి బిత్తరపోయారు. రేయ్ ఎవడ్రా నువ్వు శుభమా అని పెళ్లి జరుగుతుంటే ఇక్కడికి వచ్చి పెళ్లి నిలిపేయాలని అంటున్నావు, నీకు ఏమైనా మెంటలా అంటూ నవీన్ మీద చెయ్యి చేసుకున్నారు.
తాళి కట్టే సమయంలో కల్యాణ మండపానికి వచ్చిన నవీన్ పెళ్లికొడుకు ఆమె మెడలో తాళి కట్టడానికి వీలు లేదని, ఆమె నా ప్రియురాలు అని, పెళ్లికూతురు నాతో ప్రేమలో ఉందని, ఆమెను నేను పెళ్లి చేసుకోవాలని పట్టుబట్టాడు. నవీన్ ఎంట్రీతో అంతసేపు నవ్వుతూ ఉన్న పెళ్లికూతురు ముఖం మాడిపోయింది. నవీన్ రాకతో పాటు అతని మాటలతో కల్యాణ మండపంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.

బేలూరు పోలీసులు రంగప్రవేశం చేసి నవీన్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పెళ్లికూతురు, నవీన్‌లు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారని, అయితే ఆ యువతి ప్రేమ వ్యవహారాన్ని దాచిపెట్టి పెళ్లికి సిద్దం అయ్యిందని వెలుగు చూసింది. పెళ్లికూతురు తనతో ప్రేమలో ఉందని, ఇద్దరు కలిసి ఫోటోలు, వీడియోలు తీసుకున్నామని, పలు ప్రాంతాల్లో తిరిగామని గట్టిగా చెప్పాడు.
తరువాత శివమొగ్గకు చెందిన పెళ్లికొడుకు చెత్తలో సంబంధం, ఈ పెళ్లి నేను చేసుకోను అంటూ ఎదురు తిరిగాడు. ఆ సమయంలో కల్యాణ మండపంలో గందరగోళం నెలకొనింది. తరువాత ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పిన పెళ్లికొడుకు కల్యాణ మండపం నుంచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం పోలీసులు నవీన్ ను విచారణ చేస్తున్నారు. పెళ్లి ఆగిపోవడంతో ఏం చెయ్యాలో తెలీక అమ్మాయి కుటుంబ సభ్యులు తలలు పట్టుకున్నారు. హాసన్ లో గురువారం సినిమా స్టైల్లో పెళ్లి ఆగిపోవడంతో ఎక్కడ చూసినా అదే టాపిక్ మాట్లాడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications