దారుణం: పాఠశాల బాలికలపై కోచ్ లైంగిక దాడి

Posted By:
Subscribe to Oneindia Telugu

బరేలీ: ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రంలో దారుణమైన సంఘటన వెలుగు చూసింది. ఇద్దరు మైనర్‌ బాలికలపై అత్యాచార యత్నానికి ఒడిగట్టిన అథ్లెటిక్‌ కోచ్‌పై పోస్కో చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ విషయాన్ని బరేలీ పోలీసు సూపరింటిండెంట్ రోహిత్ సాజ్వాన్ చెప్పారు.

మీరాగంజ్‌లో ఓ టోర్నమెంట్‌ సందర్భంగా కోచ్‌ ఆలం తనను లైంగిక వేధింపులకు గురిచేశారని, లైంగిక దాడికి యత్నించగా తాను ప్రతిఘటించానని మహిళా అథ్లెట్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Athletics coach in UP booked for trying to rape minor athletes

కాగా, గతనెలలో నైనిటాల్‌లో జరిగిన మాన్‌సూన్‌ మారథాన్‌ సమయంలో ఆలం తనపై లైంగిక దాడికి యత్నించాడని మరో మైనర్‌ అథ్లెట్‌ ఫిర్యాదు చేశారు. మొదట బాలికకు అభ్యంతరకర చిత్రాలు చూపి ఆపై లైంగిక దాడికి యత్నించాడు.

నైనిటాల్‌ నుంచి తిరిగివచ్చిన తర్వాత ఈ విషయాన్ని బాధితురాలు తల్లితండ్రులకు వివరించగా, బాధిత బాలికలిద్దరూ తల్లితండ్రల సూచన మేరకు కోచ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A coach has been booked on charges of rape and also under the POSCO Act for allegedly attempting to rape two minor women athletes.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి