Gym trainer: ఫామ్ హౌస్ లో డిన్నర్, అర్దరాత్రి వెంటాడి వెంటాడి నరికి చంపేశారు !

బెంగళూరు/ దావణగెరె: కండలు తిరిగిన శరీరం పెంచిన యువకుడు జిమ్ సెంటర్ లో ట్రైనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. ఆ సిటీలో యువకుడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతిరోజు కొందరు యువకులను వెంట వేసుకుని తిరుగుతున్న జిమ్ ట్రైనర్ అతని కండలు చూపిస్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు. ప్రతిరోజు ఉదయం జిమ్ సెంటర్ లో అమ్మాయిలు, మహిళలు, అబ్బాయిలకు కండలు ఎలా పెంచాలి, శరీరం ఎలా తగ్గించుకోవాలి అంటూ శిక్షణ ఇస్తున్నాడు. అలాంటి జిమ్ ట్రైనర్ ను దారుణంగా వెంటాడి వెంటాడి నరికి చంపేయడం కలకలం రేపింది. మహిళ విషయంలో జిమ్ ట్రైనర్ హత్య జరిగి ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

కర్ణాటకలోని దావణగెరెలో నగరంలో ధన్యకుమార్ అలియాస్ ధన్య అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. కండలు తిరిగిన శరీరం పెంచిన ధన్య కుమార్ దావణగెరెలోని స్టైల్ జిమ్ సెంటర్ లో జిమ్ సెంటర్ లో ట్రైనర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. దావణగెరె సిటీలో ధన్య కుమార్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రతిరోజు కొందరు యువకులను వెంట వేసుకుని తిరుగుతున్న జిమ్ ట్రైనర్ ధన్య కుమార్ అతని కండలు చూపిస్తూ అందరిని ఆకర్షిస్తున్నాడు.

Attack: Gym trainer hacked to death in Davanagere in Karnataka.

బుధవారం రాత్రి దావణగెరె నగరం శివార్లలోని ఫామ్ హౌస్ లో స్నేహితుడి పెళ్లి సందర్బంగా ఏర్పాటు చేసిన డిన్నర్ కు ధన్య కుమార్ వెళ్లాడు. రాత్రి 1 గంట వరకు లిక్కర్ పార్టీతో పాటు మాంసాహార వంటలు తింటూ అందరూ ఎంజాయ్ చేశారు. రాత్రి 1. 30 గంటల సమయంలో ప్రత్యర్థులు ఒక్కసారిగా ధన్య కుమార్ మీద విరుచుకుపడ్డారు.

ప్రత్యర్థులు వేట కొడవళ్లు, కత్తులతో దాడి చెయ్యడంతో ధన్య కుమార్ హడలిపోయాడు, ధన్య కుమార్ తో పాటు అతని స్నేహితులు దిక్కుతోచకపరుగు తీశారు. ఫామ్ హౌస్ నుంచి బయటపడిన ధన్య కుమార్ పొలాల్లో పరుగు తీసి తప్పించుకోవాలని ప్రయత్నించాడు. అయితే ప్రత్యర్థులు వెంటాడి వెంటాడని ధన్య కుమార్ ను అతి కిరాతకంగా నరికి చంపేశారు. గురువారం ధన్య కుమార్ హత్యకు గురైన విషయం వెలుగు చూడటంతో దావణగెరెలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+