బెంగళూరులో అర్దరాత్రి మందు పార్టీ, హంగామా: స్థానికుల మీద దాడి, పోలీసులకు పట్టించి !
ఇంటి టెర్రాస్ మీద మందు, మ్యూజిక్ పార్టీ, అర్దరాత్రి చిందులుబెంగళూరులో నానా హంగామా చేసిన ఉత్తర భారతదేశ యువతీ యువకులుప్రశ్నించడానికి వెళ్లిన స్థానికులపై దాడి, పోలీసులకు అప్పగించిన స్థానిక మహిళలు
బెంగళూరు: బెంగళూరు నగరంలో రాత్రి 10 గంటల నుంచి మరుసటి రోజు వేకువ జామున వరకు పీకలదాక మద్యం సేవించిన ఉత్తర భారతదేశానికి చెందిన యువతీ యువకులు నానా హంగామా చేశారు. ప్రశ్నించడానికి వెళ్లిన స్థానికుల మీద దాడి చేసిన ఘటన బెంగళూరులోని మైకోలేఔట్ లో జరిగింది.
బెంగళూరులోని మైకోలేఔట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంటిలో ఉత్తర భారతదేశానికి చెందిన యువతీ యువకులు నివాసం ఉంటున్నారు. శుక్రవారం రాత్రి ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఉత్తర భారతదేశానికి చెందిన స్నేహితులను మైకోలేఔట్ లోని వారి ఇంటికి పిలిపించుకున్నారు.
రాత్రి 10 గంటలకు మందు పార్టీ మొదలైయ్యింది. రాత్రి ఎక్కువ సౌండ్ తో మ్యూజిక్ పార్టీ ఏర్పాటు చేశారు. మద్యం మత్తులో పాటలకు చిందులు వేస్తూ ఇంటి టెర్రాస్ మీద నానా హంగామా చేశారు. వీరి హంగామాతో నిద్రలేక స్థానికంగా నివాసం ఉంటున్న వారు విసిగిపోయారు.

ఎందుకు ఎక్కువ సౌండ్ తో పాటలు పెట్టారని స్థానికులు ప్రశ్నించడానికి వారి ఇంటికి వెళ్లారు. మద్యం మత్తులో ఉన్న యువకులు స్థానికుల మీద దాడి చేశారు. ప్రశ్నించడానికి వెళ్లిన స్థానిక మహిళలను టెర్రాస్ మీద నుంచి కిందకు తొసి వెయ్యడానికి ప్రయత్నించారు.
స్థానికులు, మహిళలు అందరూ కలిసి మద్యం మత్తులో ఉన్న యువతీయువకులను పట్టుకుని మైకోలేఔట్ పోలీసులకు అప్పగించారు. తాము మందు పార్టీ చేసుకోలేదని, దీపావళి పండుగ చేసుకుంటున్నామని విద్యార్థులు తప్పించుకోవడానికి ప్రయత్నించారని పోలీసులు అంటున్నారు.
-
నటుడిగా మహేష్ కుమారుడి విధ్వంసం.. వీడియో వైరల్..! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు












Click it and Unblock the Notifications