Aunty: భార్యను చంపేసి వేరే పెళ్లి కోసం స్కెచ్, కోడలికి సుపారి ఇచ్చి డీల్ చేసిన కేటుగాడు, ఆంటీ ఫినిష్ !
భోపాల్/మధ్యప్రదేశ్: వివాహం చేసుకున్న దంపతులు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. దంపతులు గొడవలు పడుతున్న సమయంలోనే వాళ్ల కుమారుడికి పెళ్లి జరిపించారు. కొడుకు, కోడులు కూడా వారితోనే కలిసి నివాసం ఉంటున్నారు. భార్యతో గొడవలు పడుతున్న వ్యక్తి మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని తెలిసింది. ఇదే సందర్బంలో భర్తకు అతని కోడలి ద్వారా తన భార్యను చంపించాలని స్కెచ్ వేశాడు. కోడలికి సుపారి ఇచ్చి భార్యను హత్య చేయించడానికి అతను కోడలితో డీల్ మాట్లాడుకున్నారు. అనుకున్న స్కెచ్ ప్రకారం భార్యను హత్య చేయించాడు. అయితే పరిస్థితులు తారుమారు కావడంతో మహిళ హత్య కేసులో ఆమె భర్త, కోడలు పోలీసులకు చిక్కిపోయారు.

దంపతుల హ్యాపీలైఫ్
మధ్యప్రదేశ్ లోని రేవా జిల్లాలోని గంగేవ్ ప్రాంతంలో వాల్మీకి కోల్ (51) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. 25 సంవత్సరాల క్రితం వాల్మీకి కోల్ సరోజ్ అలియాస్ సరోజా (50) అనే మహిళను వివాహం చేసుకున్నారు. వివాహం చేసుకున్న వాల్మీకి కోల్, సరోజా దంపతులు సంతోషంగా కాపురం చేశారు.

కొడుక్కి పెళ్లి చేశారు
వాల్మీకి కోల్, సరోజా దంపతులకు ఓ కుమారుడు ఉన్నాడు. రానురాను దంపతుల మద్య గొడవలు మొదలైనాయి. వాల్మీకి కోల్, సరోజా దంపతులు గొడవలు పడుతున్న సమయంలోనే వాళ్ల కుమారుడికి కంచన్ కోల్ (25) అనే పెళ్లి జరిపించారు. కొడుకు, కోడులు కూడా వాల్మీకి కోల్, సరోజా దంపతులతో కలిసి నివాసం ఉంటున్నారు.

భార్య హత్యకు కోడలితో డీల్
భార్య సరోజాతో గొడవలు పడుతున్న వాల్మీకి కోల్ మరో మహిళను మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడని తెలిసింది. భార్య సరోజా బతికి ఉంటే రెండో పెళ్లి చేసుకోవం సాధ్యం కాదని వాల్మీక్ కోల్ తెలుసుకున్నాడు. ఇదే సందర్బంలో భార్య సరోజాను కోడలు కంచన్ కోల్ ద్వారా చంపించాలని వాల్మీకి కోల్ పవర్ స్కెచ్ వేశాడు.

అత్తను చంపేసిన కోడలు
నా భార్యను చంపేస్తే తాను జీవించినంతకాలం నీకు ప్రతినెల రూ. 4 వేలు ఇస్తానని వాల్మీకి కోల్ అతని కోడలు కంచన్ కోల్ తో డీల్ మాట్లాడుకున్నారు. జులై 12వ తేదీ వాల్మీక్ కోల్ వేరే ఊరిలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లాడు. కంచన్ కోల్ భర్త కూడా మీరట్ వెళ్లాడు. ఆ సందర్బంలో కంచన్ ఇనుప రాడ్ తీసుకుని ఆమె అత్త సరోజా మీద దాడి చేసి చంపేసింది. అనుకున్న స్కెచ్ ప్రకారం భార్య సరోజాను హత్య చేయించాడు. అయితే పరిస్థితిలు తారుమారు కావడంతో సరోజా హత్య కేసులో ఆమె భర్త వాల్మీకి కోల్, కోడలు కంచన్ కోల్ పోలీసులకు చిక్కిపోయారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications