Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Aunty: పుట్టింటిలో మకాం, భార్య మీద మోజు, అడ్డుపడిన అత్తను చంపిన అల్లుడు !

బెంగళూరు: పెద్దలు సెట్ చేసిన పెళ్లి చేసుకున్న దంపతులు కొన్ని సంవత్సరాలు సంతోషంగా కాపురం చేశారు. దంపతులకు ఓ కూతురు ఉంది. క్యాబ్ డ్రైవర్ అయిన భర్త రాత్రిపూట ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇదే సమయంలో భర్త పీకలదాక మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న భర్త అతని భార్య మీద అనుమానంతో ఆమెను చితకబాదేశాడు. భర్త టార్చర్ తట్టుకోలేక భార్య కూతురితో కలిసి ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భర్తతో విడాకులు తీసుకోవాలని భార్య లాయర్ ను కలిసింది. మూడు సంవత్సరాల తరువాత భార్య మీద మోజుపడిన భర్త అత్తారింటికి వెళ్లాడు. భార్య పుట్టింటివాళ్లు తాగుబోతుకు అక్షింతలు వేసి బుద్దిమాటలు చెప్పి పంపించేశారు. తన భార్య దూరం కావడానికి అత్త కారణం అని అల్లుడు రగిలిపోయాడు. జోబులో సుత్తి పెట్టుకుని వెళ్లి కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన అత్తను సుత్తితో కొట్టి చంపేసిన అల్లుడు చేతులు దులుపుకున్నాడు.

 6 సంవత్సరాల క్రితం పెళ్లి

6 సంవత్సరాల క్రితం పెళ్లి

బెంగళూరులోని మారతహళ్లిలో నాగరాజు (35) అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. మారతహళ్లి సమీపంలోని సంజయ్ నగర్ లో సౌభాగ్య అనే మహిళ నివాసం ఉంటున్నది. సౌభాగ్య కుమార్తె భవ్యశ్రీని ఆరు సంవత్సరాల క్రితం నాగరాజు పెళ్లి చేసుకున్నాడు. భవ్యశ్రీని పెళ్లి చేసుకున్న తరువాత రెండు సంవత్సరాలు నాగరాజ్ అతని భార్యతో సంతోషంగా కాపురం చేశాడు.

మద్యంకు బానిస... భార్య మీద డౌట్ ?

మద్యంకు బానిస... భార్య మీద డౌట్ ?

నాగరాజు డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నాగరాజ్, భవ్యశ్రీ దంపతులకు ఓ కూతురు ఉంది. డ్రైవర్ అయిన నాగరాజ్ రాత్రిపూట ఎక్కువగా బయట ఉంటున్నాడు. ఇదే సమయంలో నాగరాజ్ పీకలదాక మద్యం సేవించడం అలవాటు చేసుకున్నాడు. మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న నాగరాజ్ అతని భార్య భవ్యశ్రీ మీద అనుమానంతో ఆమెను చితకబాదడం మొదలుపెట్టాడు.

 పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

పుట్టింటికి వెళ్లిపోయిన భార్య

భర్త నాగరాజ్ టార్చర్ తట్టుకోలేక అతని భార్య భవ్యశ్రీ మూడు సంవత్సరాల క్రితం ఆమె కూతురితో కలిసి సంజయ్ నగర్ లోని ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కొంతకాలం నాగరాజ్ అతని భార్య భవ్యశ్రీని ఇంటికి పిలుచుకుని వెళ్లాలని ప్రయత్నించి తరువాత సైలెంట్ అయిపోయాడు. భవ్యశ్రీ ఆమె తల్లి సౌభాగ్యతో పాటు కుటుంబ సభ్యులతో కలిసి పుట్టింటిలోనే ఉంటున్నది.

 భార్య మీద మోజుపడ్డాడు

భార్య మీద మోజుపడ్డాడు

భర్త నాగరాజ్ తో విడాకులు తీసుకోవాలని డిసైడ్ అయిన భవ్యశ్రీ ఇటీవల ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఓ లాయర్ ను కలిసింది. మూడు సంవత్సరాల తరువాత భార్య భవ్యశ్రీ మీద మోజుపడిన నాగరాజ్ ఆమెను ఇంటికి పిలుచుకుని వెళ్లాలని సంజయ్ నగర్ లోని అత్తారింటికి వెళ్లి ఇంటికి వెలుదామని అతని భార్య భవ్యశ్రీకి చెప్పాడు.

 అల్లుడికి చివాట్లు పెట్టిన అత్త

అల్లుడికి చివాట్లు పెట్టిన అత్త

భార్య భవ్యశ్రీ, ఆమె తల్లి సౌభాగ్యతో పాటు పుట్టింటివాళ్లు తాగుబోతు నాగరాజ్ కు చివాట్లు పెట్టి కొన్ని అక్షింతలు వేసి మా అమ్మాయిని నీతో పంపించము, ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ బుద్దిమాటలు చెప్పి పంపించేశారు. తన భార్య భవ్యశ్రీ తనకు దూరం కావడానికి మా అత్త సౌభాగ్య కారణం అని ఆమె అల్లుడు నాగరాజ్ రగిలిపోయాడు.

అత్తను సుత్తితో కొట్టి చంపిన అల్లుడు

అత్తను సుత్తితో కొట్టి చంపిన అల్లుడు

నాగరాజ్ అత్త మారతహళ్లిలో కూరాకు వ్యాపారం చేస్తోంది. అత్త సౌభాగ్య వ్యాపారం చేస్తున్న చోటకు నాగరాజ్ వెళ్లాడు. జోబులో సుత్తి పెట్టుకుని వెళ్లిన నాగరాజ్ కూతురిని ఇచ్చి పెళ్లి చేసిన అత్త సౌభాగ్యను సుత్తితో ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు. తీవ్రగాయాలైన సౌభాగ్యను ఆసుపత్రికి తరలించారు. కొన్ని రోజులు చికిత్స పొందిన సౌభాగ్య చనిపోయింది. అత్త సౌభాగ్యను హత్య చేసిన నాగరాజ్ ను హెచ్ఏఎల్ పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. భార్య భవ్యశ్రీతో గొడవపడి ఆహె తల్లి సౌభాగ్యను చంపేసి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించిన నాగరాజ్ అడ్డంగా బుక్కైపోయాడు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+