Aunty: ఇంటి వెనక్కి వెళ్లిన ఆంటీని చంపేసి ?, ఎంజాయ్, జల్సాల కోసం ఆంటీని లేపేసి ? !
బెంగళూరు/రామనగర: వివాహం చేసుకున్న మహిళ ఆమె భర్తతో సంతోషంగా జీవిస్తోంది. దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. భర్తకు కాలు విరిగిపోవడంతో అతను అనారోగ్యానికి గురై మంచంపట్టాడు. సొంత ఇంటిలో కిరాణా షాపు పెట్టుకుని డబ్బులు సంపాదిస్తోంది. మహిళ దగ్గర బంగారు నగలు ఎక్కువగానే ఉన్నాయి. మహిళ నివాసం ఉంటున్న ఇంటి వెనుకే ఆమె దారుణ హత్యకు గురైయ్యింది. మహిళ హత్య కేసులో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మైనర్ అబ్బాయితో సహ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ఇద్దరు కొడుకులు
కర్ణాటకలోని రామనగర సమీపంలోని అచ్చలు కాలనీలో కెంపమ్మ (50) అనే మహిళ నివాసం ఉంటున్నది. 25 సంవత్సరాల క్రితం కెంపమ్మ కుటుంబ సభ్యులు సెట్ చేసిన కెంచయ్య అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న కెంపమ్మ ఆమె భర్త కెంచయ్యతో సంతోషంగా జీవిస్తోంది. కెంపెమ్మ, కెంచయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు.

వ్యాపారం చేస్తున్న మహిళ
కెంపమ్మ ఇద్దరు కుమారులు రామనగర్ లో ఆటో డ్రైవర్లు. ప్రతిరోజు ఉదయం నుంచి రాత్రి వరకు ఆమె కుమారులు రామనగర్ లోనే ఉంటారు. భర్త కెంపయ్యకు కాలు విరిగిపోవడంతో అతను అనారోగ్యానికి గురై మంచంపట్టాడు. కెంచమ్మ ఆమె సొంత ఇంటిలోని ఓ షాప్ రూమ్ లో కిరాణా షాపు పెట్టుకుని వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తోంది.

మహిళ దారుణ హత్య
కెంపమ్మ దగ్గర బంగారు నగలు ఎక్కువగానే ఉన్నాయి. కిరాణాపుతో పాటు కెంపమ్మ ఆవుపాల వ్యాపారం చేస్తోంది. ప్రతిరోజు ఆవులను కిరాణా షాపు వెనుక వైపు కట్టేస్తుంటారు. కెంపమ్మ నివాసం ఉంటున్న ఇంటి వెనుకే ఆమె ఈనెల 8వ తేదీన ఆవులను కట్టేయడానికి వెళ్లింది. అదే రోజు రాత్రి ఇంటి వెనుకే కెంపమ్మ దారుణ హత్యకు గురైయ్యింది. కెంపమ్మ హత్యకు గురి కావడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది.

ఎంజాయ్ చెయ్యాలని ఆంటీని లేపేశారు
కెంపమ్మ హత్య కేసులో అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మైనర్ అబ్బాయితో సహ ముగ్గురు యువకులను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల విచారణలో దిమ్మతిరిగిపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం సేవించాలని, అమ్మాయిలతో ఎంజాయ్ చెయ్యాలని ఆశతో కెంపమ్మను హత్య చేసిన యువకులు ఆమె శరీరం మీద ఉన్న బంగారు నగలు, నగదు లూటీ చేశారని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. కెంపమ్మ కళ్ల ముందే పుట్టి పెరిగిన ముగ్గురు నిందితులు చివరికి ఆమెను హత్య చేశారని పోలీసు అధికారులు అంటున్నారు.
-
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్












Click it and Unblock the Notifications