ఊహించని షాక్: నడిరోడ్డుపై ముద్దుపెట్టి, కౌగిలించుకుని పరారైన ఆటో డ్రైవర్!..
షాక్ నుంచి తేరుకున్న ముగ్గురు యువతులు కేకలు వేయడంతో ఆ ఆటోడ్రైవర్ పరారయ్యాడు. ఆటో నంబర్ నోట్ చేసుకున్న ముగ్గురు యువతులు నేరుగా ఒదియంజాలై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.
హైదరాబాద్: స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్లిన ఓ యువతికి చేదు అనుభవం ఎదురైంది. క్లైమేట్ ను ఆస్వాదిస్తూ రోడ్డుపై పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న తరుణంలో.. ఓ ఆటో డ్రైవర్ అకస్మాత్తుగా పరిగెత్తుకొచ్చి ఆమెకు ముద్దుపెట్టాడు. ఆపై క్షణాల్లో అక్కడినుంచి పరారయ్యాడు. ఊహించని ఈ ఘటనకు నిర్ఘాంతపోయిన యువతి పోలీసులను ఆశ్రయించడంతో.. ఈ విషయం వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ కు చెందిన యువతి చెన్నైలోని ఎలక్ట్రానిక్స్ సంస్థలో పనిచేస్తున్నారు. ఇటీవల స్నేహితులతో కలిసి ఆమె పుదుచ్చేరి వెళ్లారు. అక్కడే ఓ హోటల్లో రూమ్ తీసుకుని, పలు ప్రాంతాలను తిలకించారు. ఈ క్రమంలోనే హోటల్ కు సమీపంలోని అన్నాసాలై ప్రాంతంలో నిలబడి స్నేహితులతో యువతి మాట్లాడుతుండగా.. కొంచెం దూరంలో ఉన్న ఆటో డ్రైవర్ హఠాత్తుగా యువతిని ముద్దు పెట్టుకుని, కౌగిలించుకున్నాడు.

షాక్ నుంచి తేరుకున్న ముగ్గురు యువతులు కేకలు వేయడంతో ఆ ఆటోడ్రైవర్ పరారయ్యాడు. ఆటో నంబర్ నోట్ చేసుకున్న ముగ్గురు యువతులు నేరుగా ఒదియంజాలై పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆటో నంబరు ఆధారంగా దర్యాప్తు చేసిన పోలీసులు, స్థానిక చిన్నయాపురం అక్కాస్వామికోవిల్ వీధికి చెందిన స్టాలిన్ ను అదుపులోకి తీసుకున్నారు. మద్యం మత్తులోనే తానలా ప్రవర్తించానని స్టాలిన్ అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని ఆటోను స్వాధీనం చేసుకున్నారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications