అవతార్ 2 - బీబీసీ రివ్యూ: ‘సినిమాలో పస లేదు, దృశ్యాల్లో కొత్త లేదు, పాత్రలకు వ్యక్తిత్వం లేదు.. టెర్మినేటర్ బెటర్’

జేమ్స్ కామెరూన్ అవతార్ సినిమా విడుదలై 13 ఏళ్లు అయ్యింది. వసూళ్లలో అంతకు ముందు ఆయనే తీసిన టైటానిక్ సినిమా పేరిట ఉన్న రికార్డులను అవతార్ బద్ధలు కొట్టింది.

ఒక దశాబ్దానికి పైగా నిరీక్షణ తర్వాత కామెరూన్ పండోర గ్రహానికి తిరిగి వచ్చారు.

ఈ సినిమాలో భార్య నాతిరి (జో సాల్దానా), తన నలుగురు పిల్లలతో తన జాతికి నాయకుడైన జేక్ సల్లీ (సామ్ వర్తింగ్‌టన్) ప్రశాంతమైన జీవితం సాగిస్తుంటాడు.

చిట్టిపొట్టి డ్రెస్సులలో కనిపించే వీరంతా తాము ఈ గ్రహం మీద ఎంత సంతోషంగా ఉన్నాం కదా అని ఆలోచిస్తూ కాలక్షేపం చేస్తుంటారు.

భూమి మీద నుంచి వచ్చిన అంతరిక్ష నౌకలు ఆకాశంలో గర్జించడం మొదలు పెట్టినప్పుడు వారి ప్రశాంతత చెడిపోతుంది.

ఆక్రమణదారులు 'టెర్మినేటర్ 2’ ప్రారంభంలో కనిపించే మంటల తరహాలో మైళ్ల పొడవున అడవిని కాల్చివేస్తారు.

'ఏలియన్స్’ సినిమాలోలాగా కనిపించే ఎక్సోస్కెలెటిన్ రోబోటిక్ యంత్రాలతో వారు చాలామంది అక్కడ దిగిపోతారు.

"అవతార్: ది వాటర్‌వే" అనేది జేమ్స్ కామెరూన్ గ్రేటెస్ట్ హిట్‌ అని స్పష్టమవుతుంది. టైటిల్‌లో వాటర్ అని ఉండటం వల్ల, కొన్ని సన్నివేశాలు నేరుగా 'ది అబిస్’ లేదా 'టైటానిక్‌’ల నుంచి తీసుకున్నట్లు కనిపిస్తుంది.

ఏది ఏమైనా మనుషులపై పూర్తిగా విజయం సాధించాలనే ఉద్దేశంతో, జేక్ వారిపై గెరిల్లా యుద్ధం చేస్తాడు. రైల్వే ట్రాక్‌లను పేల్చివేసి ఆయుధాలను దొంగిలిస్తాడు.

అయితే, ఈ నీలిరంగు రాబిన్ హుడ్‌ను అడ్డుకోవడానికి నాటింగ్‌హామ్‌కు చెందిన నీలిరంగు పోలీస్ కూడా ఉన్నాడు.

అవతార్ సినిమాలో విలన్ కల్నల్ మైల్స్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్) చివరిలో చనిపోతాడు. కానీ, అతని మెమరీ నావి శరీరంలోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. దీంతో అతను సల్లీ మాదిరిగానే చాలా బలంగా, పొడవుగా ఉంటాడు. అతను తన చావు గురించి ఏమాత్రం లెక్క చేయడు.

ఒక భీకర సాహసయాత్రకు, అక్కడక్కడా వలసవాదం, సంలీనవాదాల నైతిక చర్చలతో ఓ సుదీర్ఘ అంతరిక్ష కావ్యానికి వేదిక సిద్ధమైంది. కానీ, కామెరూన్ ఈ సినిమాను మరో దిశలోకి తీసుకెళ్లాడు. దీంతో 'ది వే ఆఫ్ వాటర్’ చప్పగా మారింది.

బతికివచ్చిన క్వారిట్జ్‌ తన మీద పగ పట్టాడని తెలుసుకున్న జేక్, తన కుటుంబంతో కలిసి తమ పెంపుడు డ్రాగన్ల మీద ఎక్కి దూరంగా ఉన్న దీవులకు వెళ్లి అక్కడ వేరొక తెగ జనం దగ్గర దాక్కుంటాడు. ఇది జేక్‌, కామెరాన్ ఇద్దరూ ఇలా చేయటం గందరగోళంగా కనిపిస్తుంది.

అవతార్ సినిమా‌ జేక్ గురించి మనకు పెద్దగా చెప్పదు. కానీ, అతను అరివీర పోరాటయోధుడని ఆ సినిమా నిరూపిస్తుంది. అలాంటి సైనికుడు అవతార్ టూలో క్వారిచ్‌తో నేరుగా పోరాడటానికి బదులు చాటుగా పారిపోవడం చాలా పిరికితనం లాగా కనిపిస్తుంది. అతి ఆ కారెక్టర్ లక్షణం లాగా కనిపించదు.

దుష్ట శక్తుల మీద పోరాడటంలో తన సైన్యానికి సారథ్యం వహిస్తున్నపుడు నెలకొన్న అసాధారణ, అత్యవసర పరిస్థితుల కథాగమనంలో సీరియస్‌నెస్‌‌ను దెబ్బతీసింది.

ఒకవైపు దండెత్తి వచ్చిన వారు పండోరా గ్రహాన్ని తగలబెడుతూ, ఊచకోతకు పాల్పడుతోంటే వారి గురించి మర్చిపొమ్మని, సల్లీ కుటుంబం బీచ్‌లో సేదదీరుతున్న తీరును చూసి ఆనందించండని కామెరూన్ ప్రేక్షకులకు చెప్తాడు.

ఎందుకంటే సీన్ తర్వాత సీన్‌లో.. జేక్, నాతిరి, వారి పిల్లలు ఇసుక తిన్నెల మీద విహరిస్తూ, మెరుపులీనే సముద్రంలో ఈదుతూ ఉంటారు.

చిన్నవయసులో ఉన్న సల్లీ పిల్లలు మత్స్యకన్య పిల్లలతో సరసాలాడుతూ, గొడవ పడుతూ కనిపిస్తారు. మధ్య మధ్యలో వారి మాటల్లో బ్రో (బ్రదర్), కజ్ (కజిన్) అనే ఇంగ్లీషు మాటలు పలికిస్తాడు దర్శకుడు.

జేక్ కొడుకుల్లో ఒకరు ఒక ఒంటరి తిమింగలంతో స్నేహం చేస్తాడు. ప్రతి ఒక్కరూ కొత్త తరం హిప్పీ అభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. పండోర చరిత్ర, భౌగోళిక శాస్త్రంపై గంభీరమైన ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఇవి సోషల్ మీడియాలో మనకు తెలియని వారు ఇచ్చే విసుగుపుట్టే సందేశాల్లాగా కనిపిస్తాయి. లేదంటే 'రిటర్న్ ఆఫ్ ది జేడీ’ సినిమాలో లాగా ల్యూక్, హాన్, లియాలు ఇవోక్ గ్రామంలో గంటల తరబడి చెప్పుకునే అంతులేని ముచ్చట్ల లాగా అనిపిస్తాయి. .

కొన్నిసార్లు ఫిలిప్ కె. డిక్ సైన్స్ ఫిక్షన్ 'వియత్నాం వార్’ సినిమాను గుర్తుకు తెస్తుంది. ఒక చిన్నారి, మరో తిమింగలం కలిసి ఈత కొడుతున్న దృశ్యాలు కనిపిస్తాయి.

అవతార్

అయితే అది అందంగా, చూడచక్కగా ఉంటుంది. సాంకేతికతపై జేమ్స్ కామెరూన్‌కున్న పట్టును, ఆసక్తి స్పష్టంగా కనిపిస్తుంది. అత్యాధునిక కంప్యూటర్ గ్రాఫిక్స్, డిజిటల్ 3D, హైపర్-రియల్ క్లారిటీ మొదలైన సాంకేతిక పరిజ్ఙానాన్ని ఉపయోగించారు.

కానీ, ఈ గిమ్మికులన్నీ మనల్ని సినిమా లోపలికి కాకుండా బయటకు తీసుకెళతాయి. యాక్షన్ నుంచి పక్కకు తీసుకెళతాయి. గ్రాఫిక్స్ విజువల్స్ ఎంత ఆకట్టుకునేలా ఉన్నా, యాక్షన్ మాత్రం వాస్తవంలాగా అనిపించదు. ఎందుకంటే ఇది కార్టూన్‌కు, లైవ్ యాక్షన్ సినిమాకు మధ్యలో ఉంటుంది.

2009లో నిజంగా ప్రేక్షకుల మతి పోగొట్టిన అవతార్ కంటే 'ది వే ఆఫ్ వాటర్’ సినిమా మెరుగ్గా కూడా లేదు. గ్రాఫిక్ డిజైన్ల విషయానికి వస్తే, మనం మొదట పండోర గ్రహం మీద దిగినప్పటి రోజర్ డీన్ రూపొందించిన దృశ్యాలంత అద్భుతంగానూ లేవు.

కథా వేదిక వర్షపుటడవుల నుంచి సముద్రానికి మారడం ఒక సమస్య. వాస్తవంలో.. భూమి మీద మహాసముద్రాల నిండా మనకు నమ్మశక్యం కాని రకరకాల జీవులు ఎన్నో ఉన్నాయి. కామెరూన్, అతని బృందం సృష్టించిన సముద్ర జీవులు వాటికన్నా ఎక్కువ భిన్నంగా అబ్బురపరిచేలా లేవు.

'ది లిటిల్ మెర్మెయిడ్’ సినిమాలో మాదిరిగా పచ్చబొట్లతో, నాలుగు కళ్లు ఉన్న తిమింగలాల గుంపు నీటిలో నాట్యం చేయడం సరదాగా ఉంటుంది. కానీ, ఇది నిజమైన తిమింగలాల వీడియోలను చూసినంత అద్భుతంగా లేదు.

మధ్య మధ్యలో కళ్లకు కనువిందు చేసే ఇలాంటి దృశ్యాలు కూడా సినిమాలో వేగాన్ని తగ్గించాయి. నింపాదిగా సాగుతున్నట్లు అనిపించేలా చేస్తాయి. ఈ సినిమా దాదాపు 192 నిమిషాల నిడివి ఉంది. మొదటి అవతార్ కంటే అరగంట ఎక్కువ.

కానీ మనుషులు పండోరా మీద దిగిన ప్రారంభ సన్నివేశాల తర్వాత కథ పెద్దగా ముందుకే సాగదు. మూడు గంటల పాటు, కథాంశం కేవలం సల్లీ కుటుంబం వెకేషన్‌కు వెళ్లడం, క్వారిచ్ వాళ్లను వెదికి పట్టుకోవటం, క్లైమాక్స్‌లో వారి మధ్య చిన్న సముద్ర యుద్ధం జరగటం.. ఇదే కథ. అంతే.

సంక్లిష్టమైన సైనిక వ్యూహాలు లేవు, ఆలోచింపజేసే సంభాషణలు లేవు. అర్థవంతమైన పాత్రలు లేవు. ద వే ఆఫ్ వాటర్‌లో ఏ పాత్ర కన్నా కానీ 'టెర్మినేటర్’‌కి మరింత వ్యక్తిత్వం ఉంది.

ఇక తిమింగలాలకు సంబంధించినవి మినహా చాలా ఇతర అంశాలు అసంపూర్ణంగా మిగిలిపోతాయి.

ఉదాహరణకు, జేక్ పిల్లలలో ఒకరు, అవతార్ సినిమాలో చనిపోయిన గ్రేస్ (సిగౌర్నీ వీవర్) బయాలాజికల్ డాటర్. మరి ఆమె బయోలాజికల్ ఫాదర్ ఎవరు? ఆమె పండోరలోని వన్యప్రాణులతో టెలిపతిలో ఎలా కమ్యూనికేట్ చేయగలుగుతుంది? అలాంటి ప్రశ్నలకు మనకు ఈ సినిమాలో సమాధానం కనిపించదు.

ఎందుకంటే 'ది వే ఆఫ్ వాటర్’ ఇప్పుడు అధికారికంగా 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్’ మాదిరిగా సీరియల్ ఫ్రాంచైజీలో భాగం. కాబట్టి ఈ సినిమా తనకు తానుగా విడిగా నిలవాల్సిన విషయాన్ని పట్టించుకోదు.

అవును, అవతార్ సీక్వెల్ కోసం మనం 13 సంవత్సరాలు వేచి ఉండాల్సి వచ్చింది. అయితే 2024, 2026, 2028లో మరో మూడు సినిమాలు విడుదల అవుతాయని చెప్తున్నారు. ది వే ఆఫ్ వాటర్ సినిమాను బట్టి చూస్తే.. అవన్నీ చెప్పిన సమయానికి విడుదలవుతాయా అన్నది చూడాల్సిందే.

అయితే.. రోబోలు, క్లోన్‌లతో నిండిన స్పేస్‌షిప్‌లలో ఆల్ఫా సెంటారీ గ్రహానికి ప్రయాణించగలిగిన 22వ శతాబ్దపు మనుషులు.. ఒక చెక్క బాణాన్ని తట్టుకునేంత బలమైన గాజును ఎందుకు అభివృద్ధి చేయలేక పోయారనే ఒక కీలక సందేహాన్ని కామెరూన్ తన సీక్వెల్స్‌లో తీరుస్తారని ఆశిద్దాం.

ఇవి కూడా చదవండి:

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+