ఆడపిల్లకు రక్షణ ఎక్కడ?: డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై లైంగిక దాడి
బెంగుళూరు: ప్రస్తుత సమాజంలో పోటీ వాతావరణం ఎక్కువైంది. డబ్బు సంపాదనే ధ్యేయంగా ఉన్న తల్లిదండ్రులు తమ చిన్నారులను డే కేర్ సెంటర్లలో వదిలి వెళ్తున్నారు. ఈ క్రమంలో అక్కడ వారు చేసే వికృత చేష్టలను తెలుసుకొని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు.
చిన్నారుల పట్ల డే కేర్ నిర్వాహకులు ప్రదర్శించే అలసత్వాన్ని సైతం తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. డే కేర్ సెంటర్లో ఉంచిన మూడేళ్ల ఓ చిన్నారిపై అక్కడి 46 ఏళ్ల వ్యక్తి చేతిలో లైంగిక దాడికి గురైన సంఘటన తాజాగా బెంగళూరులోని జగజ్జీవన్ రామ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... సంధ్య బరాడియా అనే మహిళ ఓ డే కేర్ సెంటర్‌ను నిర్వహిస్తోంది. ఈ డే కేర్ సెంటర్‌లో ఓ రోజు ఉదయం వదిలి వెళ్లిన మూడేళ్ల చిన్నారిని తల్లిదండ్రులు సాయంత్రం తమ ఇంటికి తీసుకెళ్లారు. అయితే, ఇంట్లో తీవ్రంగా కడుపు నొప్పితో బాధపడుతోన్న తమ చిన్నారిని తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లారు.

ఈ క్రమంలో చిన్నారికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్డర్లు ఆ చిన్నారి లైంగిక వేధింపులకు గురైందని తెలిపడంతో చిన్నారి తల్లిదండ్రులు షాక్‌కు గురయ్యారు. దీంతో వెంటనే చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
వెంటనే దర్యాప్తు ప్రారంభించిన బెంగుళూరు పోలీసులు విచారణలో ఖంగుతినే వివరాలు వెల్లడయ్యాయి. డే కేర్ సెంటర్‌ను సంధ్య బరాడియా అనే మహిళ ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే నిర్వహిస్తోందని, ఆ మహిళ భర్తే మూడేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపారు.
డే కేర్ సెంటర్ నిర్వహిస్తోన్న సంధ్య బరాడియాతో పాటు, చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డ ఆమె భర్తను అరెస్టు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications