నిజమేనా? : కశ్మీర్ అందాలు.. విరబూసిన తులిప్ పూలు (వీడియో)
శ్రీనగర్ : ఆసియాలోనే అతిపెద్దదైన తులిప్ పూల గార్డెన్ సందర్శకులతో కిటకిటలాడుతోంది. దాల్ సరస్సు సమీపంలో కొలువుదీరిన ఈ పూలవనం విజిటర్స్ ను అలరిస్తోంది. వేల సంఖ్యలో విరబూసిన పూలు సందర్శకుల మనసులు దోచేస్తున్నాయి. గార్డెన్ లోకి వెళితే బయటకు తిరిగి రావొద్దనిపించే విధంగా ఆహ్లాదం పంచుతున్నాయి.

కశ్మీర్ లోయలో టూరిజం సీజన్ ప్రారంభమవుతుందనడానికి చిహ్నంగా.. ప్రతి ఏడాది ఈ గార్డెన్ లోకి పర్యాటకులను అనుమతిస్తారట. ఈ పూలవనంలో వికసించే ఒక్కో తులిప్ పువ్వు మాగ్జిమమ్ 3 నుంచి 4 వారాల పాటు వాడిపోకుండా ఉంటాయట. రంగురంగుల పూలు, ఆహ్లాదకరమైన వాతావరణం టూరిస్టులకు ఎక్కడాలేని అనుభూతిని పంచుతాయనేది స్థానికులు చెప్పే మాట. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది ప్రముఖ న్యూస్ ఏజెన్సీ.
#WATCH A large number of tourists visit Asia's largest Tulip garden in Srinagar, Jammu and Kashmir. pic.twitter.com/UK0d7JNHEh
— ANI (@ANI) April 28, 2019
అయితే ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ వీడియో పాతదంటూ ఓ నెటిజన్ పెట్టిన కామెంట్ చర్చానీయాంశంగా మారింది. ఇక్కడ ప్రస్తుతం అలాంటి సీనేమీ లేదని.. తులిప్ పూలు విరగబూశాయనేది అబద్ధమని కొట్టిపారేశారు. అంతేకాదు 28వ తేదీ ఆదివారం నుంచి ఎవరినీ గార్డెన్ లోకి అనుమతించేది లేదని.. తులిప్ పూలు తక్కువగా పూయడమే అందుకు కారణమన్నట్లుగా ఉన్న ఓ నోటీసును కూడా ఆయన షేర్ చేయడం గమనార్హం. ఫ్లోరికల్చర్ డైరెక్టరేట్ నుంచి విడుదలైనట్లుగా ఉన్న సర్క్యులర్ అది.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications