ఈ రైల్వే స్టేషన్లల్లో ప్లాట్ ఫామ్ టికెట్లు నిలిపివేత- వారికి మినహాయింపు

Mumbai stampede: ఇంకో మూడు రోజుల్లో దేశ ప్రజలు వైభవంగా దీపావళి పండగ, ఛాత్ పూజను జరుపుకోనున్నారు. తమ స్వస్థలాల్లో కుటుంబ సభ్యుల మధ్య ఈ వేడుకలను జరుపుకోవడానికి సిద్ధమౌతున్నారు. స్వస్థలాలకు బయలుదేరి వెళ్లడానికి సమాయాత్తమౌతోన్నారు. ఫలితంగా రైళ్లు, బస్సు ప్రయాణానికి డిమాండ్ ఏర్పడింది.

ప్రయాణ ప్రాంగణాలు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. ఇది తొక్కిసలాటకు దారి తీసింది. ముంబైలోని బాంద్రా టెర్మినస్‌లో ఆదివారం ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. తమ సొంతూళ్లకు బయలుదేరి వెళ్లడానికి ప్రయాణికులు భారీ సంఖ్యలో బాంద్రా టెర్మినస్‌కు చేరుకోవడం ఈ ఘటనకు దారి తీసింది.

Bandra stampede Restrictions on platform ticket till November 8 in these Railway Stations

వందలాదిమంది ప్రయాణికులు ఒక్కసారిగా ప్లాట్ ఫామ్ నంబర్ 1పైకి చేరుకోవడం, బాంద్రా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌కు వెళ్లాల్సిన నంబర్ 22921 సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ప్లాట్ ఫామ్ మీదికి రావడంతో తోపులాట చోటు చేసుకుంది. అది తొక్కిసలాటకు దారి తీసింది. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

బిహార్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్‌లల్లో ప్రతి సంవత్సరం దీపావళి తరువాత పెద్ద ఎత్తున ఛాత్ పూజను జరుపుకొంటారు. జీవనోపాధి కోసం ఇతర ప్రాంతాలకు తరలివెళ్లిన ఆయా రాష్ట్రాలవారంతా సొంతూళ్లకు చేరుకుంటుంటారు. ఫలితంగా రైళ్లకు తాకిడి ఏర్పడుతుంటుంది.

దీన్ని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్లాట్ ఫామ్ టికెట్ల అమ్మకాలపై ఆంక్షలను విధించారు. ముంబై రైల్వే డివిజన్ పరిధిలోని ముంబై సెంట్రల్, దాదర్, బాంద్రా టెర్మినస్, బోరివలి, వసై రోడ్, వాపి, వల్సాడ్, ఉధనా, సూరత్ స్టేషన్లల్లో తాత్కాలికంగా ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.

నవంబర్ 8వ తేదీ వరకు అంటే పండగ రద్దీ ముగిసేంత వరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయి. ప్లాట్ ఫామ్‌పై రద్దీని నివారించడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పశ్చిమ రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులు మాత్రమే స్టేషన్‌లోకి రావాల్సి ఉంటుంది. వారివెంట కుటుంబ సభ్యులు, బంధుమిత్రులను అనుమతించరు.

సీనియర్ సిటిజన్లు, వైద్య చికిత్సను తీసుకుంటున్న వారిని ఈ ఆంక్షల నుంచి మినహాయించారు. వారిని రైలు ఎక్కించడానికి వెళ్లే సహాయకులు ప్లాట్ ఫామ్ టికెట్లను తీసుకోవచ్చు. దీనికి సరైన కారణాన్ని వివరించాల్సి ఉంటుంది. లేదా మెడికల్ డాక్యుమెంట్లను చూపించాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+