Bangalore:ఇంటర్ మార్కులకు ఇళ్లు అద్దెకు లింకేంటి బాస్..!

బెంగళూరు: బెంగళూరులో ఒక అపార్టుమెంట్‌లో ఫ్లాట్ అద్దెకు దొరకాలంటే 12వ తరగతి లేదా ఇంటర్మీడియట్‌లో 90శాతం మార్కులు తప్పనిసరి. ఇదేం విడ్డూరం అని అనుకుంటున్నారా.. అవును ఇది నిజం. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న ఓ వ్యక్తికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. అసలు స్టోరీలోకి వెళదాం.

బెంగళూరులో అద్దె కోసం ఇళ్లు వెతుకుతున్న ఓ వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. ముందుగా ఈ వ్యక్తి ఓ బ్రోకర్‌ను ఇంటి కోసం కలిశాడు. బ్రోకర్ ఓ అపార్ట్‌మెంట్‌లో ఇళ్లు చూపించాడు. ఆ తర్వాత ఇంటి ఓనర్‌ను ఈ వ్యక్తికి పరిచయం చేశాడు. అంతా ఓకే అనుకుని తన ఇంటిని ఆ వ్యక్తికి అద్దెకిచ్చేందుకు ఒప్పుకున్నాడు ఓనర్. కానీ తీరా చేరాక ఆ వ్యక్తికి 12వ తరగతిలో వచ్చిన మార్కులను చూసి ఇంటిని ఖాళీ చేయాల్సిందిగా కోరాడు.

banglore

ఇది కాస్త విడ్డూరంగా అనిపించొచ్చు కానీ జరిగింది మాత్రం ఇదే. బ్రోకర్‌ను కలిసిన సమయంలో ఆ వ్యక్తికి సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్‌ను తీసుకున్నాడు. ఓనర్ నిబంధనల మేరకు ఆ వ్యక్తి నుంచి 10వ తరగతి, 12వ తరగతి మార్క్‌ షీట్స్ జిరాక్స్, ఆధార్, పాన్ కార్డ్ వంటివి జిరాక్స్ తీసుకున్నాడు.ఆ తర్వాత 150 నుంచి 200 పదాలతో తనను తాను పరిచయం చేసుకుంటూ ఒక వ్యాసం కూడా రాయించుకున్నాడు.

అన్నీ అయ్యాక అనుకోకుండా బ్రోకర్ దగ్గర నుంచి సమాచారం వచ్చింది.ఓనర్ ఇళ్లు అద్దెకు ఇవ్వడం లేదని చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన ఆ వ్యక్తి కారణమేంటని అడిగాడు. 12వ తరగతిలో 90శాతం మార్కులు కాకుండా 75శాతం మార్కులే వచ్చినందుకు ఓనర్ ఇళ్లు ఇచ్చేందుకు తిరస్కరించాడని చెప్పడంతో ఈ వ్యక్తికి మైండ్ బ్లాక్ అయ్యింది. వాట్సాప్‌లో సాగిన ఈ సంభాషణ అంతా వ్యక్తి తాలూకా బంధువు ఒకరు స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌‌గా మారింది.

ఇక ఈ చాట్‌ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజెన్లు తమదైన స్టయిల్‌లో స్పందించారు.ఇంటర్‌లో 75శాతం మార్కులు వచ్చిన తనకు అసలు బెంగళూరులోనే ఇళ్లు దొరకదని కామెంట్ చేయగా.. గార్డెన్ సిటీలో ఇళ్లు అద్దెకు దొరకాలంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ పెడతారేమో అని కామెంట్ చేశారు. ఒక వేళ నువ్వు ఐటీ కంపెనీలో పనిచేస్తున్నావని పనిమనిషికి తెలిస్తే ఆమె రూ.30వేలు డిమాండ్ చేస్తుందని అదే ఐటీ కంపెనీ కాకుండా ఇతర సంస్థలో పనిచేస్తున్నావంటే ఆ రేటు రూ.9వేలకు పడిపోతుందని మరొకరు కామెంట్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+