Bank: బ్యాంకు కస్టమర్ల డబ్బు, రూ. కోట్లలో ఆన్ లైన్ గేమ్స్ ఆడేసిన డిప్యూటీ మేనేజర్, చేతివాటం బాగుంది !
ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ప్రజల డబ్బుతో ఏకంగా రూ. 2.36 కోట్ల డబ్బు ఆన్ లైన్ గేమ్ ఆడేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
బెంగళూరు/హావేరి: బ్యాంకులో ఉద్యోగం చేసేటప్పుడు ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకుని ఉండాలి. బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న వారు కొంచెం అవకతవలకు పాల్పడితే మొదటికే మోసం వస్తుంది. బ్యాంకులో ఆబ్రాంచ్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అకౌంటెంట్, క్యాషియర్ చేత్లుల్లో మొత్తం ఆర్థిక లావాదేవీల వ్యవహారాలు జరుగుతుంటాయి. బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ప్రజల డబ్బుతో ఏకంగా రూ. 2. 36 కోట్ల డబ్బు ఆన్ లైన్ గేమ్ ఆడేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.

బ్యాంకు అధికారుల ఎంట్రీతో ?
బ్యాంకులో డిప్యూటీ మేనేజర్ గా పని చేస్తున్న వ్యక్తి ఆ బ్రాంచ్ లో అందరితో బాగానే ఉన్నాడు. డిప్యూటీ మేనేజర్ హోదాలో అకౌంటెంట్, క్యాషియర్ దగ్గరకు వెళ్లి కొందరి అకౌంట్లకు డబ్బులు ట్రాన్సఫర్ చేయించాడు. ఇలా కోట్ల రూపాయల డబ్బును డిప్యూటీ మేనేజర్ గోల్ మాల్ చేయించారు. బ్యాంకు సీనియర్ అధికారులకు డౌట్ రావడంతో ఆడిటింగ్ చేయించడంతో మ్యాటర్ మొత్తం బయటకు వచ్చింది.

డిప్యూటీ మేనేజర్ ఆన్ లైన్ గేమ్స్
కర్ణాటకలోని హవేరీ నగరంలోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో రూ. 2.36 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. బ్యాంకు సొమ్ముతో డిప్యూటీ మేనేజర్ ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నట్లు ఆరోపణలు వెలుగు చూశాయి. బ్యాంక్
డిప్యూటీ మేనేజర్ వీరేశ కాశీమఠం గత ఆరు నెలలుగా బ్యాంకు సొమ్మును దుర్వినియోగం చేస్తున్నాడని వెలుగు చూసింది. ఏకంగా రూ. 2.36 కోట్ల డబ్బును వీరేష్ కాశీమఠం దుర్వినియోగం చేసినట్లు సమాచారం.

రూ. కోట్లలో గోల్ మాల్ చేసి సైలెంట్ గా ?
డిప్యూటీ మేనేజర్ వీరేశ కాశీమఠం అతని స్నేహితులు, బంధువుల బ్యాంకు ఖాతాకు నగదు బదిలీ చేశారు. వివిధ ఖాతాలకు నగదు బదిలీ చేసి దుర్వినియోగం చేశారు. ఈ మేరకు హవేరి షహర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ మేనేజర్ వీరేష్ కాశీమఠాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసును పోలీసు అధికారులు సీఐడీ విచారణకు బదిలీ చేశారు. ఐసీఐసీఐ బ్యాంకు డిప్యూటీ మేనేజర్ ప్రజల డబ్బుతో ఏకంగా రూ. 2. 36 కోట్ల డబ్బు ఆన్ లైన్ గేమ్ ఆడేశాడని వెలుగు చూడటం కలకలం రేపింది.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications