Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్‌లో 12 రోజులు బ్యాంక్ హాలిడేస్
అక్టోబర్ నెలలో బ్యాంకులకు సెలవులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వినియోగదారులు తమ కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అక్టోబర్ మాసానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. దాదాపు 12 రోజులపాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులుపడే అవకాశం ఉంటుంది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్, ధన్‌తేరాస్, దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. ఆదివారాల్లో కలిపి 12 రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి.

అయితే, రాష్ట్రాల వారీగా సెలవుల్లో మార్పులు ఉంటాయి. ఆయా రాష్ట్రాల్లో సంబంధిత పండుగలకు సెలవులు ఉంటాయి. అలాగే, రెండు, నాల్గవ శనివారాలతో పాటు ఆదివారాలు దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవులున్న విషయం తెలిసిందే.
బ్యాంకులకు సెలవుల వివరాలు ఇలా ఉన్నాయి..:
అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 3న నవరాత్రి వేడుకలు ప్రారంభం. మహారాజా అగ్రసేన్ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు.
అక్టోబర్ 6న ఆదివారం బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 10 మహా సప్తమి సందర్భంగా బ్యాంకులకు హాలీడే.
అక్టోబర్ 11న మహానవమి సందర్భంగా మూసివేత.
అక్టోబర్ 12న దసరా, రెండో శనివారం సందర్భంగా బ్యాంకుల మూసివేత.
అక్టోబర్ 13న ఆదివారం కావడంతో సెలవు.
అక్టోబర్ 17న కటి బిహు (అసోం), వాల్మీకి జయంతి కారణంగా బ్యాంకులకు హాలీడే.
అక్టోబర్ 20న ఆదివారం సెలవు.
అక్టోబర్ 26న విలీన దినోత్సవం సందర్భంగా జమ్మూ కాశ్మీర్‌లో, నాల్గో శనివారం హాలీడే.
అక్టోబర్ 27న ఆదివారం సెలవు.
అక్టోబర్ 31న దీపావళి, సర్దార్ వల్లభాయ్ పటేల్ సందర్భంగా సెలవు.












Click it and Unblock the Notifications