10 రోజుల పాటు బ్యాంకులు బంద్.. ఎందుకంటే..?
మీరు బ్యాంకింగ్ పనుల కోసం సిద్ధమవుతున్నారా? అయితే ఈ ముఖ్యమైన అప్‌డేట్ తప్పక తెలుసుకోవాలి. రాబోయే నవంబర్ 2025 నెలలో ఏకంగా 10 రోజుల పాటు బ్యాంకులు బంద్ (సెలవులు) ఉండే అవకాశం ఉంది. ఈ సెలవుల్లో కొన్ని వరుసగా 5 రోజుల పాటు కూడా రానున్నాయి.
నవంబర్ నెలలో భారీగా బ్యాంక్ సెలవులు
సాధారణంగా దేశవ్యాప్తంగా ప్రతి రెండో, నాలుగో శనివారాలు, అన్ని ఆదివారాల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అయితే నవంబర్‌లో ఈ సాధారణ సెలవులతో పాటు, వివిధ రాష్ట్రాల స్థానిక పండుగలు రావడంతో సెలవుల సంఖ్య పెరిగింది.ఈ నెలలో ముఖ్యంగా గురునానక్ జయంతి వంటి ప్రధాన పండుగలు వస్తున్నాయి. ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవడం ఖాతాదారులకు మంచిది.

నవంబర్ 2025లో ముఖ్యమైన సెలవు తేదీలు (ఆర్‌బీఐ జాబితా ప్రకారం):
నవంబర్ 1: కన్నడ రాజ్యోత్సవ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో బ్యాంకులు బంద్.
నవంబర్ 2: విక్రమ్ సంబత్ న్యూ ఇయర్ / గోవర్ధన పూజ సందర్భంగా బంద్.
నవంబర్ 3: నింగోల్ చకుబా / భాయ్ దూజ్ సందర్భంగా సెలవు.
నవంబర్ 5: గురునానక్ జయంతి / కార్తీక పౌర్ణమి సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో సెలవు.
నవంబర్ 7: ఛట్ పూజ కారణంగా బంద్.
నవంబర్ 8: కనకదాస జయంతి సందర్భంగా కొన్ని చోట్ల సెలవు.
నవంబర్ 11: లహాబాబ్ సందర్భంగా బంద్.
నవంబర్ 12: ఈగస్ బగ్వాల్ కారణంగా బంద్.
నవంబర్ 20: గరియా పూజ సందర్భంగా సెలవు.
నవంబర్ 23: సెంగ్ కుట్ సందర్భంగా సెలవు.
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ, ఖాతాదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా డిజిటల్ సేవలు కొనసాగుతాయి. NEFT, RTGS ట్రాన్స్‌ఫర్‌లు,ఆన్‌లైన్ బిల్లు చెల్లింపులు,మొబైల్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు, కార్డు సేవలు ,
ఇవన్నీ యథావిధిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి, భారీ మొత్తంలో నగదు డిపాజిట్, విత్‌డ్రా చేయాలనుకునే వారు లేదా తప్పనిసరిగా బ్యాంకు బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పని ఉన్నవారు, సెలవుల జాబితాను ఒకసారి సరిచూసుకోవడం అత్యవసరం.
ముఖ్య గమనిక: స్థానిక పండుగల ఆధారంగా ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయి. మీ ప్రాంతానికి సంబంధించిన సెలవులను కచ్చితంగా తెలుసుకోవడం మంచిది.












Click it and Unblock the Notifications