Bank Holidays: జనవరిలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు..!

చాలా మందికి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. అయితే దాదాపు అన్ని లావాదేవీలు కూడా ఆన్ లైన్ లో నిర్వహిస్తున్నారు. అయితే కొన్ని పనులకు మాత్రం బ్యాంక్ వెళ్తున్నారు. పెద్ద మొత్తంలో చేతికి లిక్విడ్ క్యాష్ కావాలంటే బ్యాంక్ కు వెళ్లాల్సిందే. అయితే 2025 జనవరిలో ఆర్థిక లావాదేవీలు జరిపే వారికి బ్యాంకుల సెలవుల గురించి తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా ఆదివారం, రెండో, నాలుగో శనివారం బ్యాంకులు బంద్ ఉంటాయి.

అయితే కొన్ని పండుగల సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవులు ఉంటాయి. వివిధ రాష్ట్రాల్లో ఒక్కో విధంగా సెలవులను ఇవ్వనున్నారు. కొన్ని రాష్ట్రాల్లో జనవరి 1వ తేదీన సెలవు ఉంది. 2025 ఏడాదికి సంబంధించి ఆర్‌బీఐ సెలవుల జాబితాను ఇంకా విడుదల కానప్పటికీ.. కొన్ని సెలవులు పక్కా వచ్చే అవకాశం ఉంది. 1 జనవరి బుధవారం రోజు నూతన సంవత్సర దినోత్సవం సందర్భంగా సెలవు ఇవ్వనున్నారు. జనవరి 2న గురువారం మన్నం జయంతి సందర్భంగా కేరళలోని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.

Banks are likely to have 14 days of holidays in January next year

జనవరి 5 ఆదివారం సెలవు, 6 జనవరి సోమవారం గురు గోవింద్ సింగ్ జయంతి సందర్భంగా హరియాణా, పంజాబ్‌ బ్యాంక్‌లకు సెలవు ప్రకటించాయి. జనవరి 11న రెండవ శనివారం, 12 ఆదివారం బ్యాంకులు బంద్ ఉంటాయి. జనవరి 14న మకర సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడులోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. జనవరి 15న తిరువళ్లువార్ డే సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు సెలవు ఉండనుంది.

జనవరి 16న ఉజ్ఙవర్‌ తిరునాళ్ సందర్భంగా తమిళనాడులోని బ్యాంకులకు సెలవు ఉంటుంది. జనవరి 22న ఇమోయిన్ ఇరత్ప సందర్భంగా మణిపుర్‌లోని బ్యాంకులకు సెలవు ఇవ్వనున్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా త్రిపుర, ఒడిశా, పంజాబ్‌, సిక్కిం, బంగాల్‌, జమ్ముకశ్మీర్‌, ఢిల్లీల్లోని బ్యాంకులకు సెలవు ఇవ్వనున్నారు.జనవరి 25న నాలుగో శనివారం, జనవరి 26న ఆదివారం, అదే రోజు రిపబ్లిక్ డే సందర్భంగా బ్యాంకలు సెలవు ఇవ్వనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+