Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బ్యాంకులకు వరుస సెలవులు: అలర్ట్

Bank holidays in December 2024: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి.

తమ నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ తప్ప మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు. ఫలితంగా ప్రజల దైనందిన జీవితంలో అవి కీలక పాత్ర పోషిస్తోన్నాయి. అలాంటి బ్యాంకులు ఒక్క రోజు మూత పడినా వందల కోట్ల రూపాయల మేర కార్యకలాపాలు స్తంభించిపోతుంటాయి.

Banks will remain closed for 17 days in December 2024

డిసెంబర్‌ నెల మొత్తానికీ దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు రోజులను పొందుపరిచిన కంప్లీట్ లిస్ట్‌ను విడుదల చేసింది. సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంకు. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్.

ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద.. డిసెంబర్ నెల మొత్తంగా ఏడు సెలవులు ఉంటాయి బ్యాంకులకు. ఇవి పోను- ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో.. అక్కడి ప్రజల సంప్రదాయాలు, పండుగలు, తిథులను అనుసరించి జారీ చేసే సెలవులు అదనం.

రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులకు యధాతథంగా సెలవు ఉంటుంది. రాష్ట్రాలు, పండుగలు, తిథుల వారీగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన జాబితా ప్రకారం.. ఈ డిసెంబర్‌లో మొత్తంగా 17 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

డిసెంబర్ 1వ తేదీన ఆదివారం సెలవు. దీనితో పాటు 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారం రావడం వల్ల బ్యాంకులకు సెలవు ఉంటుంది. 3వ తేదీన శనివారం ఫీస్ట్ ఆఫ్ సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ వేడుకల సందర్భంగా గోవాలో బ్యాంకులకు హాలిడే. 12న మంగళవారం పా-టోగన్ నెంగ్‌మింజా వేడుకల వల్ల మేఘాలయాలో బ్యాంకులు పని చేయవు.

డిసెంబర్ 14న దేశవ్యాప్తంగా రెండో శనివారం సెలవు. 18న బుధవారం యు సొసొథమ్ వర్ధంతి సందర్భంగా మేఘాలయాలో బ్యాంకులకు హాలిడే. గోవా విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని 19న గురువారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. 24న క్రిస్మస్ ఈవ్ సందర్భంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయా, 25వ తేదీన క్రిస్మస్ పండగను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా బ్యాంకులకు హాలిడే.

26, 27, 31 తేదీల్లో క్రిస్మస్ సెలబ్రేషన్స్, కొత్త ఏడాది ఉత్సవాల కారణంగా మిజోరం, నాగాలాండ్, మేఘాలయాల్లో సెలవు ఉంటుంది. 28న నాలుగో శనివారం. 30వ తేదీన యు కియాంగ్ నంగ్బాను దృష్టిలో ఉంచుకుని మేఘాలయాల్లో బ్యాంకులకు సెలవు ఇచ్చింది ఆర్బీఐ.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+