అలర్ట్: అక్టోబర్‌లో 18 రోజులు బ్యాంకులకు సెలవులు- మూడు కేటగిరీల్లో..

ముంబై: ప్రజల రోజువారీ కార్యకలాపాల్లో బ్యాంకులు ఓ భాగం అయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంలను సందర్శించని వారు బహుశా ఎవరూ ఉండకపోవచ్చు. 95 శాతం మంది ప్రజలు ఏదో ఒక సందర్భంలో బ్యాంకులు, ఏటీఎం సేవలను వినియోగించుకుని ఉంటారంటూ కొన్ని సర్వేలు స్పష్టం చేస్తోన్నాయి.

తమ నగదు మొత్తాలను భద్రపరచుకోవడానికి బ్యాంకులు, పోస్టాఫీస్ తప్ప మరో ప్రత్యామ్నాయం అందుబాటులో లేదు. ఫలితంగా ప్రజల దైనందిన జీవితంలో అవి కీలక పాత్ర పోషిస్తోన్నాయి. అలాంటి బ్యాంకులు ఒక్క రోజు మూత పడినా వందల కోట్ల రూపాయల మేర కార్యకలాపాలు స్తంభించిపోతుంటాయి.

Banks

సాధారణ సెలవు రోజులను మినహాయిస్తే.. సమ్మెలు, బంద్‌లల్లో దీని తీవ్రత అధికంగా కనిపిస్తుంటుంది. ఇదిలావుండగా- బ్యాంకుల సెలవులకు సంబంధించిన పూర్తి జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినెలా చివరి వారంలో జారీ చేస్తుంటుంది. ఈ సారి కూడా ఆ ఆనవాయితీని కొనసాగించింది.

అక్టోబర్‌ నెల మొత్తానికీ దేశవ్యాప్తంగా బ్యాంకుల సెలవు రోజులను పొందుపరిచిన కంప్లీట్ లిస్ట్‌ను విడుదల చేసింది. సాధారణంగా మూడు కేటగిరీల్లో బ్యాంకుల హాలిడేలను ప్రకటిస్తుంటుంది రిజర్వు బ్యాంకు. ఒకటి- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, రెండు- నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ అండ్ రియల్ టైమ్ గ్రాస్ సెటిల్‌మెంట్ హాలిడే, మూడు- బ్యాంక్స్ క్లోసింగ్ ఆఫ్ అకౌంట్స్.

ఈ మూడింట్లో మొదటి కేటగిరీ కింద సాధారణ సెలవులు వర్తింపజేస్తుంటుంది. నెగోషియేబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ కింద.. అక్టోబర్ నెల మొత్తంగా ఏడు సెలవులు ఉంటాయి బ్యాంకులకు. ఇవి పోను- ఏ రాష్ట్రాేనికి ఆ రాష్ట్రంలో.. అక్కడి ప్రజల సంప్రదాయాలు, పండుగలు, తిథులను అనుసరించి జారీ చేసే సెలవులు అదనం.

రెండు, నాలుగో శనివారాలు, ఆదివారాల్లో బ్యాంకులకు యధాతథంగా సెలవులు అమలులో ఉంటాయి. ఆదివారం కూడా పనిచేసే శాఖా కార్యాలయాలకు మినహయింపు ఉంటుంది. రాష్ట్రాలు, పండుగలు, తిథుల వారీగా రిజర్వుబ్యాంకు విడుదల చేసిన జాబితా ప్రకారం.. అక్టోబర్‌లో మొత్తంగా 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

RBI

అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ జయంతి, 14వ తేదీ- మహాలయ (కోల్‌కతా), 18వ తేదీ- కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా), 21వ తేదీ- దుర్గా పూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా), 23వ తేదీ- దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయదశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం).

అక్టోబర్ 24వ తేదీన- దసరా/దుర్గాపూజ (హైదరాబాద్, ఇంఫాల్ మినహా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు), 25వ తేదీ- దుర్గా పూజ (గ్యాంగ్‌టక్), 26వ తేదీ- దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్), 27వ తేదీ- దుర్గా పూజ (గ్యాంగ్‌టక్), 28వ తేదీ- లక్ష్మీ పూజ (కోల్‌కతా) సెలవు ఉంటుంది.

అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్) సందర్భంగా సెలవు ఉంటుంది. అక్టోబర్ 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారం కావడం వల్ల బ్యాంకులకు సెలవు ఉంటుంది. 14వ తేదీన రెండవ శనివారం, 28వ తేదీన నాలుగో శనివారం కావడం వల్ల సెలవు వర్తిస్తుంది. మొత్తంగా 18 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+