బార్క్‌లో 60 క్లర్క్,స్టెనోగ్రాఫర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
బార్క్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 25 ఫిబ్రవరి 2019.
సంస్థ పేరు : బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్
మొత్తం పోస్టుల సంఖ్య : 60
పోస్టు పేరు : అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్
జాబ్ లొకేషన్: ముంబై, తారాపూర్(మహారాష్ట్ర)
దరఖాస్తులకు చివరితేదీ : 25 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు:
అప్పర్ డివిజన్ క్లర్క్: గుర్తింపు పొందిన యూనివర్శిటీనుంచి 50శాతం ఉత్తీర్ణతతో డిగ్రీ
స్టెనో గ్రాఫర్: పదవ తరగతి పాస్‌తో పాటు నిమిషానికి 80 పదాలు టైప్ చేయగలగాలి
వయస్సు : 18 నుంచి 32 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 25,500/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.100/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: రాత పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్ టెస్టు, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్రిహెన్షన్
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 31 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 25 ఫిబ్రవరి 2019












Click it and Unblock the Notifications