వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్ణాటక ఫ్లోర్ టెస్ట్: స్పీకరే కీలకం, నెక్ట్స్ సభాపతి ఎవరు?

By Narsimha
|
Google Oneindia TeluguNews

బెంగుళూరు: కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీలో బల నిరూపనలో స్పీకర్ పాత్ర కీలకమైంది. 15 రోజుల్లో యడ్యూరప్ప శాసనసభలో తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీ జెడి(ఎస్) ఎమ్మెల్యేలకు మెజారిటీ ఉన్నప్పటికీ ఏ రకంగా రక్షించుకొంటారనేది ఆసక్తికరంగా మారింది.

Recommended Video

కర్ణాటక 23వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన యడ్యూరప్ప

కర్ణాటక ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప బాధ్యతలను స్వీకరించారు. 15 రోజుల్లో యడ్యూరప్ప శాసనసభలో బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. స్పీకర్ గా ఎన్నికయ్యే వ్యక్తి అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో కీలకంగా వ్యవహరించనున్నారు.

Before floor test, BJP’s first hurdle is Speaker election

స్పీకర్ ఓటింగ్ నిర్వహణ ఎలా చేయాలనే దానిపై నిర్ణయం తీసుకొంటారు. ఓటు ఎలా వేయాలి, ఇతర విధులపై స్పీకర్ నిర్ణయం తీసుకొంటారు.

ప్రస్తుతం బిజెపికి కనీస మెజార్టీకి సుమారు 8 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది. అయితే 8 మంది ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే స్పీకర్ ఎన్నిక జరగడానికి ముందు ప్రోటెం స్పీకర్ ఎన్నిక ఉంటుంది.

ప్రోటెం స్పీకర్ రాష్ట్రంలో ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. కాంగ్రెస్ పార్టీ ఆర్ వి దేశ్ పాండే పేరును సూచిస్తోంది. అయితే బిజెపి నేతలు ఉమేష్ కాంతి పేరును ప్రోటెం స్పీకర్ గా ప్రతిపాదిస్తే దేశ్ పాండే పేరును ,ప్రతిపాదించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది.

అయితే ఈ విషయమై గవర్నర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ప్రోటెం స్పీకర్ గా ఎన్నికైన వ్యక్తి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అంతేకాదు స్పీకర్ గా ఎన్నికకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. అయితే ప్రోటెం స్పీకర్ అసెంబ్లీలో బలనిరూపణకు సంబంధించిన విషయమై స్పష్టత లేదు.

బిజెపి మాత్రం స్పీకర్ పేరుకు జగదీష్ శెట్టర్ లేద కెజి బోపయ్య పేరును పరిశీలిస్తోంది. అయితే కాంగ్రెస్, జెడి(ఎస్)కు చెందిన ఎమ్మెల్యేలు కూడ కొందరు బిజెపికి అనుకూలంగా విశ్వాస పరీక్షలో ఓటు వేస్తారని బిజెపి నేతలు అభిప్రాయపడుతున్నారు.

English summary
As the BJP scrambles to cobble up the numbers, it has one big hurdle to cross before taking the floor test. The election to the post of Speaker in the Karnataka Legislative Assembly will determine if the BJP has the numbers of not.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X