బడ్జెట్‌ను తయారు చేసిన రహస్య టీమ్ ఇదే!
పార్లమెంట్‌లో 2026 ఫిబ్రవరి 1... ఒక గంట 25 నిమిషాల బడ్జెట్ ప్రసంగం.... తొమ్మిదోసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆర్థిక మంత్రి... ఈ మూడు లైన్లే నిర్మలా సీతారామన్ మరోసారి చరిత్ర సృష్టించిన క్షణాన్ని చెప్పేస్తాయి. తొమ్మిదో బడ్జెట్‌తో మాజీ ఆర్థిక మంత్రి పీ. చిదంబరం పెట్టిన అత్యధిక బడ్జెట్‌ల (9) రికార్డును ఆమె సమం చేశారు. మోడీ ప్రభుత్వ మూడో టర్మ్‌లో ఇది రెండో బడ్జెట్ కావడం మరో విశేషం. కానీ ఈ బడ్జెట్ వెనుక ఒకరే కాదు... పాలసీలు, లెక్కలు, అంచనాలు, సంస్కరణలతో పనిచేసిన ఓ బలమైన టీమ్ ఉంది. ఆ టీమ్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
Budget ఆర్కిటెక్ట్ - అనురాధ ఠాకూర్
బడ్జెట్ రూపకల్పనలో అసలు కీలక వ్యక్తి ఆమెనే. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా ఉన్న అనురాధ ఠాకూర్ 2026-27 బడ్జెట్‌కు స్థూల ఆర్థిక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించారు. వనరుల కేటాయింపు నుంచి బడ్జెట్ డాక్యుమెంట్ల సిద్ధం వరకు అన్నింటికీ నేతృత్వం వహించారు. 1994 హిమాచల్ ప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అనురాధ, గత ఏడాది జులైలో ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిని చేపట్టిన మొదటి మహిళా ఐఏఎస్ అధికారిణి కావడం ప్రత్యేకత. ఆమెకు ఇది తొలి బడ్జెట్ అయినా... బలమైన ముద్ర వేశారు.

పన్నుల వ్యూహకర్త - అరవింద్ శ్రీవాత్సవ
బడ్జెట్ ప్రసంగంలోని పార్ట్-B... అంటే పన్నుల ప్రతిపాదనల వెనుక ఉన్న మెదడు రెవెన్యూ కార్యదర్శి అరవింద్ శ్రీవాత్సవ. ఆదాయపు పన్ను, కార్పొరేట్ ట్యాక్స్, జీఎస్టీ, కస్టమ్స్...ప్రత్యక్ష, పరోక్ష పన్నులన్నింటినీ ఈయన బృందమే పర్యవేక్షిస్తుంది. ఇది ఆయనకు రెవెన్యూ కార్యదర్శిగా తొలి బడ్జెట్ అయినా, గతంలో బడ్జెట్ డివిజన్ జాయింట్ సెక్రటరీగా పనిచేసిన అనుభవం ఉంది. ఈసారి కస్టమ్స్ సుంకాలు, టీడీఎస్ సరళీకరణపై కీలక మార్పులు ఉండొచ్చన్న అంచనాలు కూడా ఉన్నాయి.
ప్రభుత్వ ఖజానా కాపలాదారు - ఉమ్లున్‌మంగ్ వ్యూల్నామ్
ప్రభుత్వ ఖర్చులపై కన్నేసి ఉంచే వ్యక్తి.. ఎక్స్‌పెండిచర్ సెక్రటరీ ఉమ్లున్‌మంగ్ వ్యూల్నామ్. సబ్సిడీల హేతుబద్ధీకరణ, కేంద్ర పథకాల అమలు, వ్యయ నియంత్రణ, ద్రవ్యలోటు పరిమితి... ఈ అన్నింటినీ సమతుల్యం చేయడం ఈయన బృందం పని. బడ్జెట్‌లో ఎంత ఖర్చు చేయాలి, ఎక్కడ కట్టడి చేయాలి అన్న కీలక నిర్ణయాలన్నీ ఇక్కడే తీసుకుంటారు.
బ్యాంకులు, బీమా రంగానికి దిశానిర్దేశం - ఎం. నాగరాజు
ఆర్థిక సేవల కార్యదర్శి ఎం. నాగరాజు ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు, పింఛను వ్యవస్థల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తారు. ఆర్థిక సమ్మిళిత లక్ష్యాలు, సామాజిక భద్రతా పథకాలు, ఫైనాన్షియల్ రిఫార్మ్స్‌లో ఈ విభాగానిదే కీలక పాత్ర. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక అజెండాను ముందుకు నడిపించడంలో నాగరాజు బృందం ముఖ్యమైనది.
డిజిన్‌వెస్ట్‌మెంట్ గురువు - అరునిష్ చావ్లా
ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ బాధ్యత డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ అరునిష్ చావ్లా చేతుల్లో ఉంటుంది. PSUల్లో వాటాల విక్రయం ద్వారా వచ్చే పన్నేతర ఆదాయ లక్ష్యాలు సాధించడంలో ఈ విభాగం కీలకం.
పీఎస్‌యూల పనితీరుపై నజర్ - కె. మోజస్ చాలై
డిపార్ట్‌మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ సెక్రటరీ కె. మోజస్ చాలై.. ఎంపిక చేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల మూలధన వ్యయ ప్రణాళికలను పర్యవేక్షిస్తారు. బడ్జెట్ కేటాయింపులు వృథా కాకుండా వినియోగించడంలో, ఆస్తుల విక్రయంలో, పీఎస్‌యూల ఆర్థిక స్థితి సమీక్షలో ఈ విభాగం కీలకంగా ఉంటుంది.
థింక్ ట్యాంక్ - ప్రధాన ఆర్థిక సలహాదారు కార్యాలయం
బడ్జెట్ వెనుక ఆలోచనా శక్తి ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ బృందం. ఆర్థిక వృద్ధి అంచనాలు, రంగాల పనితీరు, గ్లోబల్ ఆర్థిక పరిణామాలు, భవిష్యత్ ప్రమాదాలపై అధ్యయనం చేయడం వీరి పని. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ కూడా బడ్జెట్ రూపకల్పనలో భాగస్వామి.
-
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా? -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
India Post GDS 2nd merit list 2026: పోస్టల్ జాబ్స్ సెకండ్ మెరిట్ లిస్ట్ పై అప్డేట్..! -
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్: రిటైర్మెంట్ వయస్సు పెంపు -
ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
రైతుభరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్! -
ఆరేళ్ల క్రితం ఇదే రోజు.. గుర్తుందా ఆ 'జనతా కర్ఫ్యూ'?












Click it and Unblock the Notifications