రాయి, టెంకాయి భేటీ, దొందు దొందే, రెండు పార్టీల ఫైర్ బ్రాండ్స్ ప్రత్యేక భేటీ, ఏం జరిగిందంటే ?

బెంగళూరు: కాంగ్రెస్ పార్టీపైనా, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మీద, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపైనా ఎప్పుడూ విరుచుకుపడే బెంగళూరు దక్షిణ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య పలు డిమాండ్లతో స్వయంగా డీకే శివకుమార్ ను కలిశారు. దీనికి సంబంధించి, సోషల్ మీడియా ట్విట్టర్ ( X) బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య సమాచారాన్ని పోస్ట్ చేశారు. పలు పెండింగ్ పనుల విషయంలో తాను కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ను కలిశానని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వివరించారు.

బెంగుళూరు సొరంగం మార్గాలు (అండర్ పాస్ రోడ్లు)కు బదులుగా వాహన సంచారం సవ్యంగా సాగడానికి వేరే మార్గాలు కోసం అన్వేషించాలని, రోడ్ల నిర్మాణంతో ట్రాఫిక్‌ సమస్య ఎప్పటికీ పరిష్కారం కాదని చెప్పానని అన్నారు. బనశంకరిలోని బీఎంటీసీ బస్ స్టాండ్- నమ్మ మెట్రో రైల్వేస్టేషన్ ల మధ్యలో స్కైవాకర్ ఏర్పాటు చెయ్యాలని మనవి చేశామని బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య తెలిపారు.

Bengaluru BJP MP Tejaswi Surya meeting with Karnataka DCM DK Shivakumar

ఇదే సమయంలో బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చెయ్యాలని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కు మనవి చేశామని, అన్ని పనులు త్వరలో పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తామని ఆయన మాట ఇచ్చారని బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ఎక్స్ లో వివరించారు.

ఇదే సమయంలో కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ ను బెంగళూరు దక్షిణ లోక్ సభ నియోజక వర్గం బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ తేజస్వి సూర్య ఒక్కరే కలవడం హాట్ టాపిక్ అయ్యింది. కాంగ్రెస్ పార్టీ అన్నా, ఆ పార్టీ నాయకులు అన్నా నిత్యం మండిపడే బీజేపీ ఎంపీ డీసీఎం డీకే శివకుమార్ ను ప్రత్యేకంగా కలిసి చర్చలు జరపడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

ఇప్పటికే లోక్ సభ ఎన్నికలకు సిద్దం అవుతున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు నువ్వానేనా అంటూ తలపడుతున్నారు. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ మాస్ లీడర్ డీకే శివకుమార్, బీజేపీ ఫైర్ బ్రాండ్ ఎంపీ, బీజేపీ యువనేత తేజస్వి సూర్య ప్రతేక భేటీ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+