Bengaluru: సినిమా చూపిస్తున్న పోలీసులు, పరుగో పరుగు, ఈటైమ్ లో ఏం జరుగుతోంది ?
బెంగళూరు: బెంగళూరు పోలీసులు రౌడీషీటర్ల మీద పంజా విసిరారు. శాసనసభ ఎన్నికలు, బీబీఎంపీ ఎన్నికలు సమీపిస్తున్న సందర్బంగా పోలీసులు బెంగళూరులోని రౌడీషీటర్లకు సినిమా చూపించాలని సిద్దం అయ్యారు. వేకువ జామున రౌడీషీటర్ల ఇళ్ల మీద పోలీసు అధికారులు దాడులు చేశారు.
గతంలో రౌడీషీటర్ల జాబితాలో ఉన్న రౌడీలు ప్రస్తుతం ఏం చేస్తున్నారు ?. ఎక్కడి వెళ్లి వస్తున్నారు ?, ఏ పార్టీతో సంబంధాలు పెట్టుకున్నారు అంటూ బెంగళూరు సిటీ పోలీసులు ఆరా తీస్తున్నారు. గురువారం బెంగళూరు సిటీలోని వివిద పోలీస్ స్టేసన్ల పరిధిలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ల ఇళ్ల మీద పోలీసులు దాడులు చేశారు.

గతంలో హత్యలు, హత్యాయత్నాలు చేసిన చాలా మంది బెంగళూరులో నివాసం ఉంటున్నారు. కొందరు రౌడీలకు కొన్ని రాజకీయ పార్టీల నాయకులు ఆశ్రయం ఇస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదే సందర్బంలో బెంగళూరు సిటీలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో నివాసం ఉంటున్న రౌడీషీటర్ల నివాసంపై దాడులు చేస్తున్నారు.
బెంగళూరు సీసీబీ పోలీసు అధికారులు సోదాలు చేసి పలువురుని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బెంగళూరు పోలీసులు రౌడీషీటర్లకు సినిమా చూపించడానికి సిద్దం అయ్యారు. ఇంతకాలం దౌర్జన్యాలతో ఎంజాయ్ చేసిన రౌడీలకు ఇప్పుడు పోలీసులు సినిమా చూపిస్తున్నారు.












Click it and Unblock the Notifications