ఫస్ట్ రౌండ్ లో చాన్స్ కొట్టిన రామలింగా రెడ్డి, టాప్ 10లో 8 సార్లు ఓటమి ఎరుగని రెడ్డి !
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఊహించని విధంగా లక్ష మందికి పైగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హాజరైనారు. సిద్దరామయ్య, డీకే శివకుమార్ తోపాటు కొందరు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బెంగళూరు సిటీలోని బీటీఎం లేఔట్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి (69)కి మంత్రి పదవి వరించింది. బెంగళూరుకు చెందిన సీనియర్ నాయకుడు, 8 సార్లు ఎమ్మెల్యే అయిన రామలింగా రెడ్డి సౌమ్యుడిగా, వివాదాలకు, వర్గ రాజకీయాలకు నిత్యం దూరంగా ఉండే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దగ్గర మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్లో ఒక్కరైన రామలింగా రెడ్డి సిద్దరామయ్య క్యాబినెట్ లో మొదటి విడతలో మంత్రి పదవి దక్కించారు. బెంగళూరు నగరంలోని జయనగర నియోజక వర్గం నుంచి నాలుగు సార్లు, బీటీఎం లేఔట్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పటి వరకు వరుసగా 8 సార్లు ఎమ్మెల్యే అయిన రామలింగా రెడ్డి తిరుగులేని లీడర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు.
1989లో మొదటి సారి జయనగర నుంచి జయగనగరలో జయనగర ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగా రెడ్డి అప్పటి నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు ఒక్కసారి కూడా ఓడిపోకుండా ఓటమి ఎరుగని సర్దార్ లా రామగింగా రెడ్డి ఆయన హవా చాటుకున్నారు. 1992లో వీరప్ప మోయిలి సీఎంగా ఉన్న సమయంలో మంత్రి అయిన రామలింగా రెడ్డి తరువాత డీకే శివకుమార్ కు సన్నిహితంగా మెలిగారు.
ఎస్ఎం క్రిష్ణ క్యాబినెట్ లో మంత్రి అయిన రామలింగా రెడ్డి పూర్తిగా మంత్రి పదవిలో ఉన్నారు. ధర్మసింగ్ ప్రభుత్వంలో కూడా రామలింగా రెడ్డి మంత్రిగా పని చేశారు. 2013లో సిద్దరామయ్య సీఎం అయిన తరువాత 2018 వరకు కర్ణాటక హోమ్ మంత్రిగా, రవాణా శాఖా మంత్రిగా పని చేసిన రామలింగా రెడ్డి ఎలాంటి వివాదం లేకుండా అందరితో కలసిమెలసి ఉన్నారు.
రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి 2018 అసెంబ్లీ ఎన్నికల్లో జయనగర ఎమ్మెల్యే అయ్యారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో రామలింగా రెడ్డి కుమార్తె సౌమ్యా రెడ్డి అదే జయనగర నియోజక వర్గం నుంచి కేవలం 16 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి కేసీ. రామమూర్తి చేతిలో ఓడిపోయారు. మొదటి విడతలో మంత్రి పదవి దక్కించుకున్న రామలింగా రెడ్డికి కీలక మంత్రిత్వ శాఖ దక్కే అవకాశం ఉందని తెలిసింది.












Click it and Unblock the Notifications