Bigg Boss: వర్తూరు సంతోష్ కు బెయిల్, కేసుల క్యూలో సినీస్టార్, ప్రముఖులు, మ్యాటర్ సీరియస్ !
బెంగళూరు: పులి గోళ్లతో బంగారు లాకెట్ తయారు చేయించి మెడలో వేసుకున్నాడని ఆరోపిస్తూ కర్ణాటక అటవీ శాఖ అధికారులు ఆదివారం అర్థరాత్రి అరెస్ట్ చేసిన బిగ్ బాస్ (Bigg Boss) రియాల్టీ షో కంటెస్టెంట్ వర్తూరు సంతోష్‌కు బెయిల్ మంజూు అయ్యింది. బెంగళూరులోని రెండవ ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి నరేంద్ర వర్తూరు సంతోష్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
రూ.4 వేల నగదు డిపాజిట్, ఒక పూచీకత్తుతో కోర్టు బెయిల్ మంజూరు అయ్యింది. అటవీశాఖ అధికారులు అరెస్టు చేసిన కేసులో బెయిల్ పొందిన వర్తూరు సంతోష్ తరపు న్యాయవాది నటరాజ్ అటవీశాఖ అధికారుల విధానపరమైన వైఫల్యంపై వాదించారు. వర్తూరు సంతోష్ ప్రస్తుతం పరప్ప అగ్రహారం సెంట్రల్ జైలులో ఉన్నాడు. శుక్రవారం సాయంత్రంలోగా వర్తూరు సంతోష్ విడుదలయ్యే అవకాశం ఉందని ఆయన న్యాయవాది అంటున్నారు.

బిగ్ బాస్ రియాల్టీ షోలో కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ పులి గోళ్ల లాకెట్ ధరించి బిగ్ బాస్ హౌస్‌లోకి ప్రవేశించాడు. ఈసమాచారం తెలుసుకున్న అటవి శాఖ అధికారులు వర్తూరు సంతోష్ గురించి ఆరా తీశారు. ఆగస్ట్ 8వ తేదీ నుంచి కన్నడ బిగ్ బాస్ షో ప్రారంభ ఎపిసోడ్ ప్రసారం చేయబడింది. వర్తూరు సంతోష్ పులి గోళ్లతో లాకెట్ ధరించి ఉండడాన్ని ఓ ప్రైవేట్ వ్యక్తి గమనించాడు. దీని ప్రకారం వర్తూరు సంతోష్‌పై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఫిర్యాదు చేశారు.
కర్ణాటక అటవీ శాఖ అధికారులు అక్టోబర్ 22వ తేదీ ఆదివారం బిగ్ బాస్ (Bigg Boss) షో కంటెస్టెంట్ వర్తూరు సంతోష్ ను అరెస్టు చేశారు. సోమవారం కోర్టుకు సెలవు కావడంతో వర్తూరు సంతోష్‌ను రామోహళ్లి 2వ ఏసీజేఎం కోర్టు న్యాయమూర్తి ఎదుట ఆయన నివాసంలో హాజరుపరిచి అతనిపై వచ్చిన ఆరోపణలపై సమాచారం అందించారు. దీంతో న్యాయమూర్తి వర్తూరు సంతోష్‌కు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించి పరప్ప అగ్రహార జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.
వర్తూరు సంతోష్ అరెస్ట్ తర్వాత అటవీ అధికారులు, ప్రముఖుల దగ్గర పులి గోళ్ల లాకెట్లు ఉన్న విషయం గురించి ఆరా తీశారు. అయితే వర్తూరు సంతోష్ అరెస్టు అయిన తరువాత అటవి శాఖ అధికారులు ఆసల్యంగా కళ్లు తెరచారని ఆరోపణలు ఉన్నాయి. వర్తూరు సంతోష్ అరెస్టుపై కూడా పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. అటవీ అధికారుల తీరుపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే సంతోష్‌ను అరెస్ట్ చేశారంటూ వార్తలొచ్చాయి.












Click it and Unblock the Notifications