బెంగళూరు బీఇ విద్యార్థిని ఆత్మహత్య, ర్యాగింగ్ వీడియో లీక్, అమ్మాయి నోట్లు బూతులు!

బెంగళూరు: బెంగళూరు నగరంలోని కుమారస్వామి లేఔట్ లోని దయానంద్ ఇంజనీరింగ్ కాలేజ్ లో విద్యాభ్యాసం చేస్తూ ఆత్మహత్య చేసుకున్న మేఘనా (18) కేసులో పోలీసులకు కొన్ని ఆధారాలు చిక్కాయి. మేఘనాను కాలేజ్ క్యాంపస్ లోనే ర్యాగింగ్ చేస్తూ బూతులు తిడుతున్న రెండు వీడియోలు వెలుగులోకి వచ్చాయి.

ముందు రోజు ర్యాగింగ్

ముందు రోజు ర్యాగింగ్

మేఘనా ఆత్మహత్య చేసుకోక ముందు రోజు ఆమె కాలేజ్ కు వెళ్లారు. అదే రోజు మద్యాహ్నం కాలేజ్ క్యాంపస్ లో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు మేఘనాను ర్యాగింగ్ చేశారు. మేఘనాను చుట్టుముట్టి మానసికంగా చిత్రహింసలు పెట్టిన సమయంలో మొబైల్ లో రికార్డు చేశారు.

రెచ్చిపోయిన విద్యార్థిని

రెచ్చిపోయిన విద్యార్థిని

మేఘనా తోటి విద్యార్థిని ఆమెను బూతులు తిడితున్న సమయంలో మొబైల్ లో వీడియో తీశారు. ఆ సందర్బంలో తోటి విద్యార్థిని మేఘనా మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో మిగిలిన విద్యార్థులు ఆమెను అడ్డుకున్నారు.

పోలీసుల చేతికి వీడియోలు !

పోలీసుల చేతికి వీడియోలు !

మేఘనాను ర్యాగింగ్ చేసే సమయంలో తీసిన వీడియోలను వాట్సాప్ లో షేర్ చెయ్యడంతో అవి ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కాయి. మేఘనా ఆత్మహత్యకు కారణం అయిన వారి మీద చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తండ్రి చంద్రశేఖర్ డిమాండ్ చేస్తున్నారు.

నో చాన్స్

నో చాన్స్

కాలేజ్ క్యాంపస్ లో ఎలాంటి ర్యాగింగ్ జరగలేదని, అందుకు అవకాశమే లేదనని బుధవారం దయానంద కాలేజ్ యాజమాన్యం, సిబ్బంది వివరణ ఇచ్చారు. అయితే గురువారం మేఘనాను ర్యాగింగ్ చేస్తున్న సమయంలో తీసిన రెండు వీడియోలు బయటకు రావడంతో పోలీసులు వాటిని పరిశీలించి అందులో ఉన్న యువతి, యువకుల కోసం గాలిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+