Actor: నటుడు దారుణ హత్య, స్టార్ హీరోకు వీరాభిమాని, అక్క ఆత్మహత్యకు ప్రతీకారం, వెంటాడి !

బెంగళూరు/ మండ్య: సినిమాల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకోవాలని ఓ యువకుడు ఆశపడ్డాడు. అనుకున్నట్లే బెంగళూరు చేరుకుని స్యాండిల్ వుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ప్రముఖ స్టార్ హీరోకు వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న అతను పలు సినిమాల్లో నటిస్తున్నాడు. రాత్రి ఆ నటుడు దారుణ హత్యకు గురైనాడు. నటుడిని విచక్షణారహితంగా నరికి చంపారు. మూడు నెలల క్రితం నటుడి భార్య ఆత్మహత్య చేసుకుంది. నటుడిని అతని బావమరిది హత్య చేశాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది. స్యాండిల్ వుడ్ లో ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న యువకుడు దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది.

మండ్య టూ బెంగళూరు

మండ్య టూ బెంగళూరు

కర్ణాటకలోని మండ్య జిల్లాలోని పాండవపురకు చెందిన సతీష్ అలియాస్ సతీష్ వజ్రా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఆశపడ్డాడు. మండ్య నుంచి కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరు చేరుకున్న సతీష్ నటుడు కావాలనే కోరికతో స్యాండిల్ వుడ్ లో అవకాశాల కోసం అనేక ప్రయత్నాలు చేశాడు.

 సినిమాల్లో చాన్స్

సినిమాల్లో చాన్స్

బెంగళూరు చేరుకున్న సతీష్ వజ్రా స్యాండిల్ వుడ్ లో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటికే కొన్ని సినిమాలు, సీరియల్స్, షార్ట్ ఫిలిమ్స్ లో సతీష్ వజ్రా నటించాడు. సినిమాలు అయినా, టీవీ సీరియల్స్ అయిన వచ్చిన చాన్స్ వదులుకోకుండా సతీష్ నటిస్తున్నాడు. బెంగళూరు నగరంలోని రాజరాజేశ్వరి నగర్ (ఆర్ఆర్ నగర్) లో సతీష్ వజ్రా అతని భార్యతో కాపురం పెట్టాడు.

 స్యాండిల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ వీరాభిమాని

స్యాండిల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ వీరాభిమాని

స్యాండిల్ వుడ్ లో ప్రముఖ స్టార్ హీరో దర్శన్ కు వీరాభిమానిగా గుర్తింపు తెచ్చుకున్న సతీష్ వజ్రా పలు సినిమాల్లో నటిస్తున్నాడు. తాను ఎంతగానే అభిమానించే దర్శన్ పేరుకు గుర్తుగా ది ప్రిన్స్ అనే పచ్చబొట్టు చేతి మీద వేసుకున్న సతీష్ దర్శన్ పుట్టిన రోజు తప్పకుండా ఆయన్ను కలిసి శుభాకాంక్షలు చెబుతున్నాడు. దర్శన్ తండ్రి, నటుడు తూగుదీప్ పుత్తడి విగ్రహం చేయించి హీరో దర్శన్ కు బహుమానంగా ఇచ్చాడు.

 నటుడు దారుణ హత్య

నటుడు దారుణ హత్య

శుక్రవారం రాత్రి రాజరాజేశ్వరినగర్ లో కన్నడ నటుడు సతీష్ వజ్రా దారుణ హత్యకు గురైనాడు. సతీష్ వజ్రాను విచక్షణారహితంగా నరికి చంపారు. మూడు నెలల క్రితం నటుడు సతీష్ వజ్రా భార్య ఆత్మహత్య చేసుకుంది. నటుడు సతీష్ వజ్రాను అతని బావమరిది హత్య చేశాడని వెలుగు చూడటం హాట్ టాపిక్ అయ్యింది.

 అక్క ఆత్మహత్యకు ప్రతీకారం తీర్చుకున్న తమ్ముడు

అక్క ఆత్మహత్యకు ప్రతీకారం తీర్చుకున్న తమ్ముడు

తన అక్క ఆత్మహత్యకు సతీష్ వజ్రా కారణం అని అతని బావమరిది రగిలిపోతున్నాడని పోలీసుల విచారణలో వెలుగు చూసింది. స్యాండిల్ వుడ్ లో ఇప్పుడిప్పుడే నటుడిగా గుర్తింపు తెచ్చుకుంటున్న సతీష్ వజ్రా దారుణ హత్యకు గురికావడం బెంగళూరు సిటీలో కలకలం రేపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+