నా మొగుడు దుబాయ్ లో ఉన్నాడు. నేను ఒంటరిగా ఉన్నాను, టెక్కీకి ?
బెంగళూరు: తన భర్త దుబాయ్‌లో ఉన్నాడని చెప్పి శృంగారానికి పిలిచిన మహిళ ఆమె బ్యాచ్ తో కలిసి ఓ యువకుడిని నిలువు దోపిడీ చెయ్యడమే కాకుండా డబ్బులు వసూలు చేసిన ఘటన బెంగళూరు నగరంలోని పుట్టెనహళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
బాధితుడు టెక్కీ వైట్‌ఫీల్డ్‌లో నివాసం ఉంటాడని, నిందితుతులు ఇటీవల జేపీ నగర్, ఐదవ స్టేజ్ లోని ఇంటికి ఆ టెక్కీని పిలిపించి నిలువు దోపిడీ చేశారని పోలీసులు అన్నారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి నిందితుల ఆచూకీ కోసం దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు.కొద్ది రోజుల క్రితం బాధితురాలు డేటింగ్ యాప్ ద్వారా వైల్ ఫీల్డ్ లో నివాసం ఉండే టెక్కీ మెహ్రాను సంప్రధించారు. తరువాత పరస్పరం మొబైల్ నంబర్లు ఇచ్చిపుచ్చుకుని సెక్సీగా వాట్సాప్ చాట్ మొదలుపెట్టారు.

అప్పుడు నా భర్త దుబాయ్‌లో ఉన్నాడు. నేను సెక్స్ కోసం భాగస్వామిని వెతుకుతున్నాను అని కిలాడీ ఆంటీ మోహ్రాకు చెప్పింది. దీంతో నమ్మిన మోహ్రా ఇక రెచ్చిపోయాడు. ఒంటరిగా ఉంటున్న ఆంటీతో ఎంజాయ్ చెయ్యాలని తహతహలాడిపోయాడు. ఇదే సమయంలో కిలాడీ లేడీ కూడా అతన్ని రెచ్చగొడుతూ అతనికి వాట్సాప్ లో ఆమె నగ్న ఫోటోలు పంపించింది.
తనతో శృంగారంలో పాల్గొనాలని ఆంటీ టెక్కీ మోహ్రాను రెచ్చగొట్టింది. ఆమె మోహ్రా నుంచి అతని నుండి ఫోటోలను సంపాధించింది. కిలాడీ లేడీ ఆమె ఇంటి చిరునామాను మోహ్రాకు పంపించింది. ఆంటీ అదర్స్, ఇంటి అడ్రస్ కూడా ఇచ్చేసిందని మోహ్రా చిందులు వేశాడు. వెంటనే మోహ్రా జేపీ నగర్ ఐదువ స్టేజ్ లోని ఆమె చెప్పిన ఇంటి అడ్రస్ కు వెళ్లిపోయాడు.
కిలాడీ లేడీ మోహ్రాను ఇంటిలోకి పిలిచి అతనితో నగ్నంగా బెడ్ రూమ్ లో రొమాన్స్ చెయ్యడం మొదలుపెట్టింది. ఆ సమయంలో ముగ్గురు అపరిచితులు హఠాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి బాధితుడు మోహ్రాను బెడ్‌రూమ్‌లో నిర్బందించి అతని మీద దాడి చేశారు. మేము నిన్ను ఇలాగే నగ్నంగా చేసి నడి రోడ్డు మీద ఊరేగింపుగా నడిపిస్తామని నిందితులు మోహ్రాను బెదిరించారు.

మోహ్రాను బెదిరించిన నిందితులు అతని నుంచి రూ. 3 లక్షలు డిమాండ్ చేశారు. చివరకు ఫోన్ పే ద్వారా రూ. 21 వేలు వారి ఖాతాకు బదిలీ చేసుకున్నారు. మేము అడిగినప్పుడు మిగిలిన డబ్బులు ఇవ్వాలని మోహ్రాకు వార్నింగ్ ఇచ్చిన నిందితులు అతన్ని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. నిందితులు పదేపదే బ్లాక్ మెయిల్ చెయ్యడంతో బాధితుడు మోహ్రా పుట్టేనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications