లవ్ మ్యారేజ్, ఎస్ఐ భార్య అనుమానాస్పదంగా ?, సార్ కు చుక్కలు చూపించి !
బెంగళూరు/చిక్కబళ్లాపురం/కోలారు: కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో యువతి, యువకుడికి పరిచయం అయ్యింది. కాలేజ్ లో చదువుకునే సమయంలోనే యువతి, యువకుడు ప్రేమించుకున్నారు. అయితే ప్రేమికుల పెళ్లికి ఇరువైపుల కుటుంబ సభ్యులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. ప్రియుడికి ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. తరువాత అసలు కథ మొదలు కావడంతో ప్రియురాలి ప్రాణం పోయింది. భార్య అనుమానాస్పద మృతి కేసులో బెంగళూరులోని ఎస్‌ఐ రమేష్‌ను బేగూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
గత శనివారం బేగూరులోని పటేల్ లేఅవుట్ నివాసం ఉంటున్న ఇంట్లో ఎస్‌ఐ రమేష్ భార్య శిల్పా(29) ఉరివేసుకుని శవమై కనిపించింది. మా అల్లుడు రమేష్ శిల్పాను హత్య చేశాడని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించడంతో కేసు నమోదు అయ్యింది.

ఈ ఘటనపై హత్య కేసు నమోదు చేసిన బేగూర్ పోలీస్ స్టేషన్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పుడు ఎస్‌ఐ రమేష్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిక్కబళ్లాపురం జిల్లా బాగేపల్లి తాలూకాకు చెందిన ఎస్‌ఐ రమేష్, చిక్కబళ్లాపూర్ లో నివాసం ఉండే శిల్పా కాలేజ్ లో చదువుకుంటున్న సమయంలో ప్రేమించుకున్నారు.
అప్పటికి రమేష్ కు ఎస్ గా ఉద్యోగం రాలేదు. రమేష్, శిల్పా ప్రేమను రెండు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఈ పరిణామంతో విసిగిపోయిన రమేష్ అతని ప్రియురాలు శిల్పాను గ్రామం నుంచి బెంగళూరు నగరానికి తీసుకొచ్చి సహజీవనం చెయ్యడం ప్రారంభించాడు. తరువాత రమేష్ కు సబ్ ఇన్స్ పెక్టర్ గా ఉద్యోగం వచ్చింది. చాలా కాలం పాటు ప్రియురాలితో సహజీవనం చేశాడు.

11 నెలల క్రితమే రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్న ఎస్ఐ రమేష్, శిల్పా దంపతులు చట్టబద్దంగా వివాహమైనట్లు సమాచారం. వివాహానంతరం ఎస్ఐ రమేష్, శిల్పా దంపతులు పటేల్ లేఅవుట్‌లో స్థిరపడ్డారు. బేగూర్ పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ రమేష్ పనిచేస్తున్నారు. అయితే కుటుంబ సమస్యల కారణంగా దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి.
ఓ క్రిమినల్ కేసు విచారణ నిమిత్తం రమేష్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. అదేరోజు రాత్రి శిల్పా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు. రమేష్ పని ముగించుకుని శనివారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య శిల్పా ఉరి వేసుకుని కనిపించింది. ఎస్ఐగా ఉద్యోగం చేస్తున్న రమేష్ పక్కాప్లాన్ తో అతని భార్య శిల్పాను హత్య చేశాడని శిల్పా కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. ఈ మేరకు బేగూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్ఐ రమేష్ ను పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.
-
SRH.. ఏదో తేడాగా ఉందేంటీ -
విశాఖలో వాహనదారులకు హెచ్చరిక .. ఆ పని చేస్తే ఇక కష్టమే -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ












Click it and Unblock the Notifications