ఉద్యోగాల కోసం ఐటీ హబ్ లో ఎంట్రీ ఇచ్చిన ఆంటీలు ఏం చేస్తున్నారంటే ?, టెక్కీతో !
ఐటీ హబ్ బెంగళూరు నగరంలో ఇంటి పనులు చెయ్యడానికి మహిళలకు ఎక్కువ డిమాండ్ ఉంది. మూడు ఇళ్లలో పని చేస్తే జీవితం సాఫిగా సాగిపోతుందని మహిళలు బావిస్తున్నారు. ఐటీ హబ్ బెంగళూరులో ఎక్కువగా దంపతులు ఉద్యోగాలు చేస్తుండటంతో వారి ఇళ్లలో పని చెయ్యడానికి మహిళలకు పనుల్లో పెట్టుకుంటున్నారు.
ఉదయం ఉద్యోగాలకు వెళ్లిపోతున్న దంపతులు వారికి నమ్మకం కుదిరిన తరువాత ఇళ్లలో పని చేస్తున్న మహిళల దగ్గరకు ఇంటి తాళాలు ఇచ్చేస్తున్నారు. మధ్యతరగతి కుటుంబాలతో పాటు విలాసవంతమైన అపార్ట్ మెంట్ ల్లో ఇంటి పని చెయ్యడానికి మహిళలకు ఎక్కువ డిమాండ్ ఉందని బెంగళూరులో నివాసం ఉంటున్న వారికి తెలిసిన విషయమే.

బెంగళూరు నగరంలో ఇంటి పని చేసేవాళ్ల ముసుగులో బంగారు ఆభరణాలు చోరీ చేసిన కిలాడీ లేడీలను చాకచక్యంగా పోలీసులు అరెస్ట్ చేశారు. వనితా (38), యశోదా (40) అనే ఇద్దరు మహిళలను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. ముంబాయి నుంచి బెంగళూరు వచ్చిన వనితా, యశోధా బంగారు ఆభరణాలు చోరీ చేస్తున్నారని పోలీసులు అన్నారు. బెంగళూరు నగరంలోని దొడ్డకన్నహళ్లిలోని ఎస్‌జేఆర్ ప్లాజా సిటీలోని అపార్ట్‌మెంట్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ శేఖర్ పనిలో చేరి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు.
పనిలో చేరిన మరుసటి రోజే ఇంట్లోని బంగారాన్ని ఈ ఖర్తానక్ కిలాడీ లేడీలు దోచుకున్నారు. ఈ ఇద్దరు మహిళలు ఒక పెద్ద అపార్ట్‌మెంట్ చుట్టూ తిరుగుతూ, సెక్యూరిటీ గార్డు సహాయంతో ఇంటిలో పని చేస్తున్నారు. తర్వాత ఇంటి పనుల్లో చేరి ఇంట్లోని బంగారు ఆభరణాలను చోరీ చేసేవాళ్లు. ఇంటిలో నగలు చోరీ అయ్యాయని శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు చేసిన బెల్లందూరు పోలీసులు ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకున్నారు.
అరెస్టు అయిన మహిళల నుంచి 127 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని మహిళలతో పాటు ఇతరకు ఇంటిలో పని చెయ్యడానికి అవకాశం ఇస్తే ఇలాంటి చోరీలు జరిగే అవకాశం ఉందని, మహిళల గురించి పూర్తి సమాచారం తెలుసుకున్న తరువాత వాళ్లను పనిలో పెట్టుకుంటే మంచిదని బెంగళూరు పోలీసులు బెంగళూరులో నివాసం ఉంటున్న ప్రజలకు సలహా ఇస్తున్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications