తుంగ్లక్ ప్రభుత్వంలో పనికిమాలిన నియమాలు, హిందువులను టార్గెట్ చేస్తే !

బెంగళూరు/శివమొగ్గ: హిందుస్తాన్ (భారతదేశం)లో ఉంటూ హిందువులు గుడిలో పూజలు చెయ్యాలంటే పోలీసుల అనుమతి తీసుకోవాలా ?, మేము కట్టించుకున్న గుడిలో మేము పూజలు చేసుకోవాలంటే మీ అనుమతి కావాలా ? అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మీ రాజ్యంలో హిందూవులు గుడిలో పూజలు చెయ్యకూడదా అంటూ మాజీ సీఎం కుమారుడు ప్రభుత్వ తీరుతో మండిపడటం ఇప్పుడు కలకలం రేపింది.

కర్ణాటకలో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య ఉన్నారు. సిద్దరామయ్య హిందూ వ్యతిరేకి అంటూ బీజేపీ నాయకులు పలుసార్లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు బెంగళూరులో హిందూ దేవాలయాల్లో పూజలు చెయ్యడానికి మీరు అనుమతి తీసుకున్నారా అంటూ పోలీసుల నుంచి నోటీసులు జారీ కావడంతో బీజేపీ నాయకులు మండిపడుతున్నారు.

 Bengaluru Police

కర్ణాటక మాజీ సీఎం బీఎస్. యడియూరప్ప కుమారుడు, శికారిపుర బీజేపీ ఎమ్మెల్యే బీవై. విజయేంద్ర మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు నెలలు కూడా కాకముందే హిందువుల మీద దౌర్జన్యాలు పెరిగిపోయాయని మండిపడ్డారు. హిందువులు గుడిలో పూజలు చేసుకోవాలంటే పోలీసులు, బీబీఎంపీ అధికారుల అనుమతి తీసుకోవాలా అని బీవై. విజయంద్ర ప్రశ్నించారు.

బెంగళూరులో ప్రతినిత్యం లక్షలాది మంది సంచరించే మెజస్టిక్ సమీపంలోని బీబీఎంపీ గ్రౌండ్స్ పక్కనే ఉన్న వేల సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతన నాగరకట్ట (నాగరాళ్లు)లోని నాగదేవతలను వారంలో ఒక్కరోజు ప్రత్యేక పూజలు చేస్తున్నామని. హిందువులు అందరూ కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావాలని ఓ హిందూ సంఘం పిలుపునిచ్చింది.

 Bengaluru Police

మీరు నాగరాళ్ల దగ్గర ఉన్న నాగదేవతలకు పూజలు చెయ్యడానికి బీబీఎంపీ నుంచి అనుమతి తీసుకున్నారా అంటూ బెంగళూరు పోలీసులు ఆ హిందూ సంఘ సంస్థకు నోటీసులు జారీ చెయ్యడం ఇప్పుడు కలకలం రేపింది. ఇదే నోటీసులు తన ట్విట్టర్ లో పోస్టు చేసిన మాజీ సీఎం కుమారుడు, బీజేపీ ఎమ్మెల్యే బీవై విజయేంద్ర కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం మీద మండిపడుతున్నారు.

 Bengaluru Police

కర్ణాటక ప్రభుత్వం తీరు చూస్తుంటే తుగ్లక్ పరిపాలన గుర్తుకు వస్తోందని, హిందువుల మీద ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తే మిమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడని హెచ్చరించారు. మా దేవుడిని మేము పూజించుకోవాలంటే మీ అనుమతి కావాలా అంటూ పోలీసులను, బీబీఎంపీ అధికారులను ప్రశ్నించారు. బెంగళూరులోని ఓ గుడిలో పూజలు చెయ్యడానికి పోలీసులు, బీబీఎంపీ అధికారుల, పోలీసుల అనుమతి కావాలని నోటీసులు జారీ కావడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+