ఎదురింటి మహిళ మీద ఎగబడి కరిచిన కుక్క, స్టార్ హీరో మీద ఎఫ్ఐఆర్, కారు పార్కింగ్ !

బెంగళూరు: శ్యాండిల్‌వుడ్ నటుడు, చాలెంజింగ్ స్టార్ దర్శన్‌పై ఓ మహిళ బెంగళూరులోని రాజరాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది. మహిళ ఫిర్యాదు చేయడంతో పోలీసులు హీరో మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాజరాజేశ్వరి నగర్‌లోని దర్శన్‌ ఇంటి ఎదురుగా ఉన్న ఓ ఇంట్లో నివాసం ఉంటున్న ఓ మహిళను కుక్క కరిచిన ఘటనపై హీరో దర్శన్‌పై ఫిర్యాదు నమోదైంది. మహిళ ఫిర్యాదు మేరకు రాజరాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్‌లో హీరో దర్శన్ మీద ఏకంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

ఈ కేసులో చాలెంజింగ్ స్టార్ దర్శన్ 2వ నిందితుడు (ఏ2) గా పోలీసులు కేసు నమోదు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. ఎదురింటి మహిళను హీరో దర్శన్ ఇంటి పెంపుడు కుక్క కరిచింది. కుక్క కాటుకు గురైన అమితా జిందాల్ అనే మహిళ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దర్శన్ ఇంటి దగ్గర కారు పార్క్ ఏర్పాటు చేశారు. బాధితురాలు అయిన అమితా జిందాల్ అనే మహిళ దర్శన్ ఇంటి సమీపంలోని కారు పార్కింగ్ స్థలంలో ఆమె కారు పార్క్ చేస్తున్నది.

Bengaluru police have registered an FIR against Shandlewood hero Darshan in the case of dog biting a woman

అమితా జిందాల్ ఆమె కారు తీసుకెళ్లేందుకు పార్కింగ్ ఏరియాకు వెళ్లింది. ఆ సమయంలో కారు సమీపంలో దర్శన్ ఇంటిలో పెంచుతున్న మూడు కుక్కలు ఉన్నాయి. ఈ కుక్కలను దర్శన్ ఇంటి లో పని చేస్తున్న ఇద్దరు అబ్బాయిలు కారు పార్కింగ్ ఏరియాకు తీసుకు వచ్చారని సమాచారం. నేను నా కారు తీసుకొని వెళ్లాలి, మీ కుక్కలను పట్టుకోవాలని దర్శన్ ఇంటిలో పని చేస్తున్న యువకులకు అమితా జింతాల్ అనే మహిళ మనవి చేసింది.

అయితే దర్శన్ ఇంటిలో పని చేస్తే ఆ కుర్రాళ్లు అమితా జిందాల్ మనవిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్షం చేశారని ఆరోపణలు ఉన్నాయి. అమితా జిందాల్ అనే మహిళ ఎంత చెప్పినా వాళ్లు మాత్రం దీనిపై స్పందించకుండా చూస్తూ ఉండిపోయారని తెలిసింది. దీంతో అమితా జిందాల్ గట్టిగా కేకలు వెయ్యడంతో దర్శన్ ఇంటి కుక్కలు మొరగడం మొదలుపెట్టాయి.

అయితే ఇంత జరుగుతున్నా దర్శన్ ఇంటి అబ్బాయిలు మాత్రం ఆ కుక్కలను పట్టుకోకుండా అలాగే వదిలేశారని అమితా జిందాల్ ఆరోపించారు. చవరికి ఓపిక నసించిన అమితా జిందాల్ ధైర్యంగా వెళ్లి ఆమె కారు తీసుకోవడానికి ప్రయత్నించింది. ఆ సందర్బంలో దర్శన్ ఇంటి పెంపుడు కుక్కల్లో ఓ కుక్క అమితా జిందాల్ మీద దాడి చేశాయి. అమిత్ జిందాల్ కడుపు, తదితర చోట్ల ఆ కుక్క కొరికేసింది.

Bengaluru police have registered an FIR against Shandlewood hero Darshan in the case of dog biting a woman

దీంతో ఆగ్రహించిన అమితా జిందాల్ అనే మహిళ దర్శన్‌తో పాటు అతని ఇంటి కుక్కలను సంరక్షిస్తున్న యువకుల మీద కేసు పెట్టింది. ఆర్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఐపీసీ సెక్షన్ 289 కింద హీరో దర్శన్ తో పాటు ఆ సందర్బంలో కుక్కలు పట్టుకున్న వారి మీద కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ వర్తూర్ సంతోష్ పులి గోళ్ల లాకెట్టు ధరించాడని అతన్ని అరెస్టు చేసిన తరువాత కన్నడ నటుడు దర్శన్ కూడా పులి పంజా లాకెట్టు ధరించారని అటవీ శాఖకు ఫిర్యాదు చేశారు.

ఈ ఫిర్యాదు ఆధారంగా నటుడు దర్శన్‌కు అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేశారు. హీరో దర్శన్ పులి గోళ్ల లాకెట్ కేసు విచారణ పెండింగ్‌లో ఉండగా ఇప్పుడు దర్శన్‌పై మరో కేసు నమోదు కావడంతో కన్నడిగులు హడలిపోయారు. కన్నడ నటుడు దర్శన్‌కు చెందిన పెంపుడు కుక్క మహిళను కరిచినందుకు బెంగళూరులోని పోలీస్ స్టేషన్ లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో హీరో దర్శన్ బీజేపీ అభ్యర్థుల తరుపున పలు నియోజక వర్గాల్లో జోరుగా ప్రచారం చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+