కర్నాటక సర్కార్ కు బెంగళూరు వాసుల హెచ్చరిక..! రోడ్లు వేయకపోతే..!
కర్నాటక రాజధాని బెంగళూరులో రోడ్ల దుస్దితి ఇప్పుడు జాతీయ స్దాయిలో చర్చనీయాంశంగా మారింది. బెంగళూరులో నివసిస్తున్న కోట్లాది జనంతో పాటు వచ్చి పోయే వారు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కూడా వీటిపైనే మాట్లాడుకుంటున్నాయి. ఇదే క్రమంలో తాజాగా బెంగళూరు వాసులు ప్రభుత్వానికి ఓ హెచ్చరిక పంపారు. రోడ్లు బాగు చేయకపోతే తామేం చేస్తామో వివరిస్తూ ఏకంగా సీఎం సిద్ధరామయ్యకే లేఖ రాశారు.
తాజాగా బెంగళూరులోని రోడ్లు, చెత్తపై ఓ విదేశీయుడి విమర్శల్ని ట్యాగ్ చేస్తూ బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్-షా చేసిన వ్యాఖ్యలు ఈ వ్యవహారాన్ని మరోసారి తెరపైకి తెచ్చింది. దీనిపై స్పందించిన బెంగళూరు వ్యవహారాలు చూస్తున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. నగరానికి కావాల్సింది నిరంతర విమర్శలు కాదని, సమిష్టి కృషి అంటూ వ్యాఖ్యానించారు. అనంతరం బెంగళూరులో వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం ఇదే విషయంపై సీఎం సిద్ధరామయ్యకు ఓ లేఖ రాసింది.

మంచి ప్రజా మౌలిక సదుపాయాలు అందించకపోతే గ్రేటర్ బెంగళూరు అథారిటీ ఆస్తి పన్ను వసూలు చేయకుండా చూడాలని ఆదాయపు పన్ను చెల్లింపుదారులతో కూడిన వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల ఫోరం సీఎం సిద్ధరామయ్యకు లేఖ రాసింది.
మునిసిపల్ అథారిటీల నిర్లక్ష్యం కారణంగా పౌరుల, పన్ను చెల్లింపుదారులు తమ కుటుంబాలు, పిల్లలతో పాటు తీవ్రంగా నష్టపోతున్నారని ఇందులో ఆరోపించింది.

నగరంలో తాజాగా వచ్చిన వరదల తర్వాత రోడ్ల స్థిరత్వానికి పునాది అయిన డ్రైనేజీ నెట్‌వర్క్‌ను మొదట పూర్తి చేయడానికి బదులుగా అధికారులు వర్తూర్-బలగేరె-పణత్తూర్‌లో గుంతలు, వైట్-టాపింగ్ పనులను చేపడుతున్నారని వారు ఆరోపించారు. ఇటువంటి చెత్త నిర్ణయాలు కొత్త రోడ్లను త్వరగా పాడు చేస్తాయని వారు తెలిపారు. అలాగే ప్రభుత్వ నిధులు, పన్ను చెల్లింపుదారుల సహకారాలను వృధా చేస్తాయని కూడా వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన మంత్రి డీకే శివకుమార్.. నగరంలో ఇప్పటివరకు 13వేల గుంతలు పూడ్చామని, వీటికి శాశ్వత పరిష్కారం కనుగొనడమే తన ప్రణాళిక అన్నారు.
-
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్












Click it and Unblock the Notifications