బెంగళూరులో అర్దరాత్రి ఎక్కువ సౌండ్ తో డీజే, మద్యం మత్తులో ఇంటి ఓనర్ ను చంపేసిన టెక్కీలు !
బెంగళూరు: ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో కొందరు యువకులు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. రాత్రి ఉద్యోగాలు ముగించుకుని ఇంటికి వెళ్లిన టెక్కీలు హోమ్ థియేటర్ లో పాటలు, డీజే సౌండ్ ఎక్కువగా పెట్టి నానా హంగామా చేశారు. అర్దరాత్రి ఏమిటి మీ న్యూసెన్స్ సౌండ్ తగ్గించి మ్యూజిక్ పెట్టుకొండి అంటూ ఇంటి యజమాని చెప్పారు. మద్యం మత్తులో ఉన్న టెక్కీలు సౌండ్ తగ్గించమని చెప్పిన ఇంటి యజమానిని కొట్టి చంపేయడం కలకలం రేపింది.
బెంగళూరు నగరంలోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజ్ఞాన్ నగర్‌లో లయాడ్ నేమయ్య అలియాస్ నేమయ్య అనే ఆయన అతని కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. నేమయ్య చాలా సంవత్సరాల క్రితమే ఆ ప్రాంతంలో సొంతంగా ఇంటికి కట్టుకున్నారు. నేమయ్య ఓ ఇంటిలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటూ మరికొన్ని ఇండ్లు అద్దెకు ఇచ్చారు.

ఒడిశాకు చెందిన యువకుటు బెంగళూరు చేరుకుని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీలో టెక్కీలుగా ఉద్యోగం చేస్తున్నారు. రాత్రి మద్యం మత్తులో ఇంటికి వెలుతున్న టెక్కీలు ఇంట్లో హోమ్ థియేటర్ లో మ్యూజిక్ సౌండ్ ఎక్కువగా పెట్టుకుని, డీజే పాటలతో లేనిపోని రాద్దాంతం చేస్తున్నారు. ఇంతకు ముందే చాలాసార్లు మీరు సౌండ్ తక్కువగా పెట్టుకోవాలని, మా ఇంట్లో ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పెద్దలు ఉన్నారని నేమయ్య ఒడిశా టెక్కీలకు చెప్పాడు.
అయితే ఏప్రిల్ 2వ తేదీ రాత్రి ఇంట్లో లిక్కర్ పార్టీ పెట్టుకున్న టెక్కీలు నానా హంగామా చేశారు. మర్యాదగా సౌండ్ తగ్గించాలని నేమయ్య టెక్కీలను హెచ్చరించాడు. కొంత సేపటి తరువాత పీకలదాక మద్యం సేవించిన టెక్కీలు బయటకు వెళ్లి నేమయ్యను ఇంటి నుంచి బయటకు లాగి చితకబాదేశారు. టెక్కీల దాడిలో నేమయ్యకు తీవ్రగాయాలై కుప్పకూలిపోయాడు.
వెంటనే కుటుంబ సభ్యులు నేమయ్యను ఆసుపత్రికి తరలించారు. నేమయ్య కుటుంబ సభ్యులు టెక్కీల మీద హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నేమయ్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, దాడి కేసును హత్య కేసుగా మార్చిన హెచ్ఏఎల్ పోలీసులు ఓ ఇంటికి ఆసరాగా ఉన్న ఆ ఇంటి యజమానిని మద్యం మత్తులో హత్య చేశారని కేసు నమోదు చేసి టెక్కీల మీద కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications