విమానంలో వీడికి ఏం పోయేకాలం వచ్చింది, మేడమ్ చూసింది కాబట్టి సరిపోయింది, లేదంటే ?
బెంగళూరు: బస్సులు, కార్లు, లారీలు, క్యాబ్ లు ఇలా ఎక్కడపడితే అక్కడ వాహనాలు ఎక్కి ప్రయాణించేవారు వాళ్లు ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. అయితే విమానంలో ప్రయాణించే సమయంలో ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలని చాల మందికి తెలీదు, ఇదే ఓ యువకుడి కొంప ముంచింది. విమానంలో ఇష్టం వచ్చినట్లు నానా హంగామా చెయ్యడంతో ఇప్పుడు కటకటాలపాలైనాడు.
శుక్రవారం రాత్రి 1.30 గంటలకు అస్సాం నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో ఫ్లైట్ 6E 716లో ఓ యువకుడు రెచ్చిపోయాడు. అసోంకు చెందిన షెహరీ చౌదరి అనే ప్రయాణికుడు విమానంలో పొగతాగడం వల్ల అందరి ప్రాణాలతో గేమ్స్ ఆడాడు. విమానంలో ప్రయాణిస్తూ టాయిలెట్‌కు చౌదరీ వెళ్లాడు. అక్కడ తలుపు మూసిన చౌదరీ సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు.

విమానం టాయిలెట్‌లో పొగ, దుర్వాసన రావడంతో సిబ్బంది వెంటనే ప్రయాణికులందరినీ తనిఖీ చేశారు. ఈ సమయంలో ప్రయాణికుడు చౌదరీ తాగినట్లు వెలుగులోకి వచ్చింది. ఎయిర్ కండిషన్డ్ విమానంలో చిన్నపాటి మంట వచ్చినా క్షణాల్లో విమానం మొత్తం మంటల్లో కాలిపోయే అవకాశం ఉంది. అయినప్పటికీ చౌదరీ అందరి జీవితాలతో ఆడుకున్నాడు.
ఎయిర్‌లైన్స్ సిబ్బంది అతడిని తనిఖీ చేసి చౌదరీని గుర్తించి భద్రతా సిబ్బందికి అప్పగించారు. ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు. దేవనహళ్లిలోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు చౌదరీని అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరిగినా నిందితుడు మాత్రం తాను సిగరేట్ తాగలేదని విమానంలో మొండికి వేశాడు. కొన్ని గంటల ప్రయాణంలోనే తట్టుకోలేక విమానంలో సిగరేట్ తాగిన యువకుడు జైలు పాలైనాడు.












Click it and Unblock the Notifications