Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

బీహార్లో ఎన్డీయే భారీ విజయం వెనుక 5 కారణాలు..! ఓ హామీ- మరో భయం..!

బీహార్ అసెంబ్లీకి రెండు విడతల్లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తిరిగి అధికారం నిలబెట్టుకుంటోంది. ఇవాళ జరుగుతున్న ఓట్ల లెక్కింపులో తాజా సమాచారం అందే సరికి ఏకంగా 190 సీట్లకు పైగా సాధించి చరిత్రను తిరగరాస్తోంది. రెండు విడతల ఎన్నికల్లో భారీ ఎత్తున తరలివచ్చి ఓటేసిన ఓటర్లు ఎన్డీయేకు ఈ స్ధాయిలో విజయం అందిస్తారని అందులో పార్టీలే నమ్మలేదు. అయినా బీహార్లో ప్రధాని మోడీ, నితీష్ కుమార్ జోడీ మ్యాజిక్కే చేసింది. దీని వెనుక ఐదు ప్రధాన కారణాలు కనిపిస్తున్నాయి.

బీహార్ ఎన్నికల ప్రచారంలో ఈసారి ప్రధాని మోడీ పాత వ్యూహాన్నే నమ్ముకున్నారు. మహిళల్ని ఆకట్టుకునేందుకు ఓ కీలక పథకం ప్రకటించారు. వారికి ఏటా 10వేలు ఇచ్చే పథకం ప్రకటించారు. రాష్ట్రంలోని 1.3 కోట్ల మంది మహిళల్ని దృష్టిలో ఉంచుకుని ప్రకటించిన ఈ పథకం అమల్లో కూడా పెట్డేయడంతో జనం దాన్ని నమ్మారు. దీంతో 71 శాతం మంది మహిళలు పోలింగ్ బూత్ లకు తరలివచ్చి ఓటేశారు. నితీష్ ఓడిపోతే ఈ పథకం ఆగిపోతుందన్న భయంతో వారు భారీగా తరలివచ్చి ఆయన్ను మరోసారి గెలిపించారు. ఈ పథకం ముందు తాము గెలిస్తే నెలకు 2500 ఇస్తామన్న తేజస్వీ హామీ ఫలించలేదు.

Beyond the Vote 5 Factors That Secured Nitish Kumar s Big Win in Bihar

అలాగే ఎన్నికల ప్రచారంలో బీహార్ ప్రజలపై ప్రధాని మోడీ విసిరిన మరో పాచిక కట్టా సర్కార్ . అంటే అరాచక పాలన. గతంలో ఆర్జేడీ అరాచక పాలనను చూసిన జనానికి తిరిగి ఆ భయం కల్పించడంలో మోడీ-నితీష్ సక్సెస్ అయ్యారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లోనూ ఆర్జేడీ అరాచక పాలన పేరు చెప్పి ఓట్లు అడిగి గెలిచిన నితీష్ ఈసారి కూడా అదే పాచికతో విజయం సాధిస్తున్నారు. మరోవైపు తన తండ్రి, తల్లి హయాంలో సాగిన పాలన చేదుగుర్తుల్ని జనం మర్చిపోయేలా చేయడంలో తేజస్వీ సక్సెస్ కాలేకపోయారు.

Beyond the Vote 5 Factors That Secured Nitish Kumar s Big Win in Bihar

మరోవైపు ఎన్డీయే గెలుపుకు దారితీసిన ఇతర కారణాల్లో 125 యూనిట్ల వరకూ అందరికీ ఉచిత విద్యుత్ బాగా పనిచేసింది. బీహార్ గ్రామాల్లో దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. అసలే పేదరికం ఉండే బీహార్ లోని గ్రామీణ ప్రాంతాల్లో 125 యూనిట్లలోపు వాడే జనం ఎక్కువగా ఉండటంతో ఈ హామీ ఓట్లు కురిపించింది. అలాగే రాష్ట్రంలో 400 రూపాయలుగా ఉన్న వృద్ధాప్య పెన్షన్లను 1100కు పెంచుతామన్న నితీష్ హామీ కూడా ఫలించింది. ఈ హామీతో నితీష్ ను ఓడించి పంపేందుకు బీహార్ లో వృద్దులు ఇష్టపడలేదని తెలుస్తోంది. ఆయనకు మరో ఛాన్స్ ఇచ్చి తాను కావాలనుకున్నప్పుడు రిటైర్ అయ్యే అవకాశం ఇచ్చారట.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+