Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

BGMI గేమ్ రెడీ.. ఇండియాలో డౌన్ లోడ్

ప్రముఖ మల్టీ ప్లేయర్‌ షూటింగ్‌ గేమ్‌ బ్యాటిల్‌ గ్రౌండ్స్‌ మొబైల్‌ ఇండియా (BGMI) భారత్‌లోకి తిరిగి ప్రవేశించింది. ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ స్మార్ట్‌ఫోన్‌ యూజర్లకు ఇది అందుబాటులోకి వచ్చింది. గూగుల్‌ ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్ల నుంచి యూజర్లు ఈ గేమ్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. సంవత్సరం తర్వాత గేమింగ్‌ లవర్స్‌కి అందుబాటులోకి వచ్చిన ఈ గేమ్‌లో సంస్థ క్రాఫ్టన్ కొన్ని మార్పులు చేసింది. ఆడేందుకు టైమ్‌ లిమిట్‌ పెట్టింది.

బీజీఎంఐను గతంలో ఎంతసేపైనా ఆడటానికి అవకాశం ఉండేది. ఇకనుంచి ఇంతకుముందులా ఎన్ని గంటలు పడితే అన్ని గంటలు ఆడడానికి వీల్లేదు. 18 సంవత్సరాల వయసులోపువారు రోజులో మూడు గంటలు మాత్రమే ఆడటానికి వీలుందని క్రాఫ్టన్‌ వెల్లడించింది. 18 సంవత్సరాల పైబడినవారు గరిష్ఠంగా ఆరు గంటల పాటు ఆడొచ్చు. 18 ఏళ్లలోపు వయసు గేమర్స్‌కు పేరెంటల్‌ వెరిఫికేషన్‌ ఉంటుందని, ఒకవేళ గేమ్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నా అందరికీ ఒకేసారి అందుబాటులోకి రాదని తెలిపింది. రానున్న రెండు రోజుల్లో యూజర్లకు దశలవారీగా గేమ్‌ అడేందుకు అనుమతి ఇవ్వనున్నట్లు పేర్కొంది.

BGMI game relaunched in india

పబ్‌జీ తర్వాత అంత పేరు సంపాదించుకున్న గేమ్ BGMI. గతేడాది నిషేధానికి గురైంది. ఈ గేమ్‌ కార్యకలాపాలను పునఃప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చింది. ప్రస్తుతానికి 3 నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌ వెల్లడించారు.

గేమింగ్‌ కంపెనీ సర్వర్‌ లొకేషన్లు, డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు పాటించిందని, దీంతో 3 నెలల ట్రయల్‌కు మాత్రమే అనుమతిస్తున్నట్లు చెప్పారు. యూజర్లపై ఎటువంటి ప్రభావం చూపుతుంది? దీనికి ఎంతవరకు ఎలా ఎడిక్షన్ అవుతారు లాంటి అంశాలను పరిశీలించి తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. BGMIని అందుబాటులోకి తెచ్చిన క్రాఫ్టన్ సంస్థ ఆట ఆడేందుకు టైమ్ లిమిట్ పెట్టింది. అంతేకాదు.. గేమ్ కు సంబంధించిన మ్యాప్స్, ఆయుధాల్లో కొన్ని మార్పులు చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+