Pics: ఘనంగా పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వివాహం: పెళ్లి రోజు వచ్చేందంటూ వధువు

ఛండీగఢ్: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రెండో వివాహం గురువారం ఘనంగా జరిగింది. కొద్దిమంది అతిథుల సమక్షంలో డాక్టర్ గుర్‌ప్రీత్ కౌర్‌​ను సీఎం భగవంత్ మాన్ వివాహమాడారు. చంఢీగఢ్‌​లో సిక్కు సంప్రదాయం ప్రకారం జరిగిన ఈ వేడుకకు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆప్ ఎంపీ రాఘ్ చద్దాతోపాటు ఇతర పార్టీ నేతలు హాజరయ్యారు.

కొద్ది మంది అతిథుల మధ్య భగవంత్ మాన్-గుర్‌ప్రీత్ వివాహం

కొద్ది మంది అతిథుల మధ్య భగవంత్ మాన్-గుర్‌ప్రీత్ వివాహం

వధువు డాక్టర్‌ గుర్‌ప్రీత్‌ కౌర్‌ కురుక్షేత్రలోని పెహ్వా ప్రాంతంలో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. ఆమె వయస్సు ప్రస్తుతం 32 ఏళ్లు. ఆమె తండ్రి ఇంద్రజిత్‌ సింగ్‌ ఓ రైతు కాగా, తల్లి మాతా రాజ్‌ కౌర్‌ గృహిణి. గుర్‌ప్రీత్‌ ఇద్దరు సోదరిలూ విదేశాల్లో ఉంటున్నారు.

భగవంత్ మాన్‌కు అండగా నిలిచిన గుర్ ప్రీత్ కౌర్

భగవంత్ మాన్‌కు అండగా నిలిచిన గుర్ ప్రీత్ కౌర్

కాగా, కొన్నేళ్లుగా మాన్‌, గుర్‌ప్రీత్‌ కౌర్‌ కుటుంబాలు సన్నిహితంగా ఉంటున్నట్టు సమాచారం. ముల్లానా వైద్య కళాశాలలో విద్యనభ్యసించిన గుర్‌ప్రీత్‌ కౌర్‌.. బంగారు పతకం కూడా సాధించారు.పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో ఆమె భగవంత్‌ మాన్‌కు ఎంతగానో సహాయం అందించినట్టు తెలుస్తోంది.

భగవంత్ మాన్ కొత్త ప్రయాణం సంతోషంగా ఉండాలని..

భగవంత్ మాన్ కొత్త ప్రయాణం సంతోషంగా ఉండాలని..

ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా.. మాన్ ఈ రోజు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు, నేను అతని వైవాహిక జీవితం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని తన శుభాకాంక్షలు తెలియజేశారు. వేడుకకు ముందు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మీడియాతో మాట్లాడుతూ.. "సీఎం భగవంత్ మాన్ జీవితంలో ఈ రోజు కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది. నేను మాన్ సాబ్ కుటుంబాన్ని, అతని తల్లి, సోదరిని అభినందిస్తున్నాను. ఇది చిన్న ఫంక్షన్ అవుతుంది. కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతారు. "చాలా కాలం తర్వాత మన్ సాబ్ కుటుంబంలో ఆనందం తిరిగి వచ్చినందుకు మేమంతా సంతోషిస్తున్నాము. కొడుకు మళ్లీ సెటిల్ అవ్వాలనేది అతని తల్లి కల. నేడు, ఆ కల నెరవేరబోతోంది, "అని చద్దా పేర్కొన్నారు.

పెళ్లి రోజు వచ్చేసింది..

పెళ్లి రోజు వచ్చేసింది..

అంతకుముందు రోజు, వధువు గుర్ ప్రీత్ ట్విట్టర్‌లో తన ఫోటోను షేర్ చేసి, "దిన్ షగ్నా ద చద్య..." (పెళ్లి రోజు వచ్చేసింది) అని రాసింది. కాగా, సీఎం భగవంత్ మాన్ భార్య డాక్టర్ గురుప్రీత్ కౌర్ హర్యానాలోని కురుక్షేత్రలోని పెహోవాకు చెందినవారు. అతడికిది రెండో పెళ్లి. మాన్ 2015లో తన మొదటి భార్య నుంచి విడిపోయారు. మాన్ మొదటి వివాహం నుంచి ఇద్దరు పిల్లలు కూతురు సీరత్ కౌర్ (21), కుమారుడు దిల్షాన్ (17) ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+