కొడుకు అరెస్టుతో భవానికి భయం, ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నం, నేడు కోర్టులో విచారణ !
హాసన్ లోక్ సభ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ, హాసన్ లోక్ సభ నియోజకవర్గం కూటమి అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణను గురువారం అర్థరాత్రి బెంగళూరులోని కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఎంపీ ప్రజ్వల్‌ని అరెస్ట్ చేయడంతో ఆయన కుటుంబం కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతోందని, ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు కూడా అరెస్ట్ అవుతారేమోనన్న భయంతో ఉన్నారని సమాచారం.
హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియోలు లీక్ అయిన తరువాత జరిగిన మహిళ కిడ్నాప్ కేసులో కర్ణాటక మాజీ మంత్రి, ప్రజ్వల్ రేవణ్ణ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు అయ్యారు. తరువాత మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణ ముందస్తు బెయిల్ కోసం బెంగళూరులోని ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిట్ పిటీషన్ స్వీకరించిన కోర్టు నేడు (శుక్రవారం) తీర్పు ప్రకటించనుంది.

ప్రత్యేక కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జైలుకు వెళ్లకుండా భవానీ రేవణ్ణ తప్పించుకునే అవకాశం ఉందని తెలిసింది. అయితే బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరిస్తే మాజీ మంత్రి హెచ్ డీ. రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణను అరెస్టు చేస్తే ఆమె జైలుకు వెళ్లడం ఖాయమని పోలీసులు అంటున్నారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు నిర్ణయంపై అంతా ఆధారపడి ఉండటంతో నేటి న్యాయస్థానం తీర్పు చాలా ఆసక్తికరంగా మారింది.
మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి హెచ్‌డీ రేవణ్ణ అరెస్టు అయ్యి జైలు జీవితం గడిపి తరువాత బెయిల్ పొంది బయటకు వచ్చారు. ఇప్పుడు మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ భార్య భవానీ రేవణ్ణకు కూడా అరెస్టు భయం పట్టుకోవడంతో ఆమె ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక న్యాయస్థానం భవాని రేవణ్ణ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నిర్ణయాన్ని శుక్రవారం రిజర్వ్‌లో ఉంచింది.
ముందస్తు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరిస్తే మాజీ మంత్రి భార్య భవానీ రేవణ్ణ జైలుకు వెళ్లడం ఖాయం అని ఓ పోలీసు అధికారి అంటున్నారని కన్నడ మీడియా అంటోంది. మహిళలపై లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయిన ప్రజ్వల్ రేవణ్ణ కష్టాల్లో కూరుకుపోయాడు. సీఐడీ, హాసన్ జిల్లాలోని హలేనరసీపుర, సైబర్ క్రైమ్ స్టేషన్లలో నమోదైన మూడు కేసుల్లో ప్రజ్వల్ రేవణ్ణ ఇప్పటికే ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాడు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications