Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కోడిగుడ్లను బ్యాన్ చేయడమేంట్రా సామే: అదంత అన్ హెల్తీ ఏమీ కాదే

కోడిగుడ్డు ఓ మంచి పౌష్టికాహారం. మార్కెట్‌లో పేదలు నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉండే ధరలో లభించే పౌష్టికాహారం ఇది. తెల్లసొన, పచ్చసొన కాంబినేషన్‌ ఉంటుంది. ఇందులో చాలామంది తెల్లసొనను తినడానికి ఇష్టపడరు. కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని అభిప్రాయం ప్రజల్లో ఉంది. గుండెకు అంత మంచిది కాదని చెబుతుంటారు. గుడ్డులో చెప్పుకోలేనన్ని ఆరోగ్యప్రయోజనాలు మెండుగా ఉన్నాయి.

అలాంటి కోడిగుడ్డు అమ్మకాలను భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్ నిషేధించింది. ఇది తాత్కాలికమే- అయినప్పటికీ కనీస పోషకాహారాన్ని కోడిగుడ్డు అమ్మకాలను నిలిపివేయడం పట్ల స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో పాటు అన్ని రకాల మాంసం ఉత్పత్తులు, మటన్, చికెన్, చేపలు, రొయ్యల వంటి విక్రయాలను కూడా భోపాల్ లో అమ్మకం నిషేధం. ఇది అక్టోబర్ 2వ తేదీ వరకు అమలులో ఉంటుంది.

Bhopal Enforces Meat Fish and Egg Ban for Navratri

దీనికి కారణాలను వెల్లడించింది భోపాల్ మున్సిపల్ కార్పొరేషన్. దసరా నవరాత్రి ఉత్సవాలు, గాంధీ జయంతిని పురస్కరించుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతోంది. లక్షలాది మంది భక్తుల మతపరమైన మనోభావాలను గౌరవించడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశ్యం అని అధికారులు తెలిపారు. ఈ నిషేధం నవరాత్రి ఉపవాస దీక్షలను, ఆచారాలను పాటించే భక్తులకు అనుకూలంగా ఉంటుందని అన్నారు.

ఈ నిషేధాజ్ఞలు నగరం అంతటా ఉన్న మార్కెట్లు, దుకాణాలు, రెస్టారెంట్లలో అమలులో ఉంటాయి. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నిర్ణయంతో, నవరాత్రి ఆధ్యాత్మిక వాతావరణం చెక్కు చెదరకుండా ఉండటంతో పాటు, ఈ పవిత్ర కాలంలో శాకాహారాన్ని ప్రోత్సహించడం కూడా అధికారుల ముఖ్య ఉద్దేశంగా కనిపిస్తోంది.

నవరాత్రుల ప్రారంభాన్ని పురస్కరించుకుని మాంసం, చేపలు, గుడ్ల అమ్మకాలను నిలిపివేశామని జిల్లా కలెక్టర్ దివ్య పటేల్ వివరించారు. అమ్మవారి మండపాల నిర్వహణకు సంబంధించిన విధి విధానాలు, మార్గదర్శకాల జారీలో భాగంగా దీన్ని చేర్చామని పేర్కొన్నారు. గర్బా, దాండియా, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించే కమిటీలు గుర్తింపు కార్డు లేని ఏ వ్యక్తిని లోపలికి అనుమతించకూడదు. కార్యక్రమ ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సి ఉంటుందని అన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+