డిగ్గీ రాజాకు షాక్.. కాంగ్రెస్ సభలో మోడీకి ప్రశంసలు.. యువకుడిని తోసేసిన వైనం (వీడియో)

Recommended Video

    Lok Sabha Election 2019 : డిగ్గీ రాజాకు షాక్.. కాంగ్రెస్ సభలో మోడీకి ప్రశంసలు..! || Oneindia Telugu

    భోపాల్ : ఎన్నికల వేళ చిత్రవిచిత్రాలు జరుగుతుంటాయి. ప్రచారంలో నేతలు చేసే ఫీట్లు నవ్వు తెప్పిస్తుంటాయి. అదే సమయంలో ప్రత్యర్థులపై చేసే ఆరోపణలు రివర్స్ అవుతుంటాయి. తాజాగా మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో అలాంటి సంఘటనే జరిగింది. మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు ఊహించని పరిణామం ఎదురైంది. ప్రధాని నరేంద్ర మోడీపై ఆరోపణలు గుప్పిస్తూ.. చివరకు తాను ఇరకాటంలో పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    భోపాల్ లోక్‌‌సభ నుంచి దిగ్విజయ్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఆ నేపథ్యంలో నిర్వహించిన కాంగ్రెస్ సభలో డిగ్గీ రాజాకు ఓ యువకుడు షాకిచ్చాడు. అక్కడి సభలో ఉద్వేగంగా మాట్లాడుతున్న దిగ్విజయ్ సింగ్ మోడీ టార్గెట్ గా ఆరోపణాస్త్రాలు సంధించారు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో 15 లక్షల రూపాయలు మోడీ వేస్తామన్నారు. మీలో ఎవరికైనా వచ్చాయా అంటూ అక్కడున్నవారిని అడిగారు. దాంతో ఒక యువకుడు చేయి ఎత్తడంతో స్టేజీ పైకి రమ్మని ఆహ్వానించారు. మోడీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి టెర్రరిస్టులను అంతమొందించారు, అది చాలు అని ఆ యువకుడు చెప్పిన సమాధానంతో డిగ్గీ రాజా సహా అక్కడున్న కాంగ్రెస్ నేతలకు షాక్ కు గురయ్యారు.

    కాంగ్రెస్ సభలో మోడీపై ప్రశంసలు కురిపించడంతో ఈ వీడియో బాగా వైరల్ అయింది. అయితే డిగ్గి రాజాకు ఒక క్షణం పాటు ఏమి అర్థం కాలేదు. ఆ తర్వాత తేరుకుని యువకుడి చేతిలో నుంచి మైక్ లాక్కున్నారు. స్టేజీపై ఉన్న మరో లీడర్ ఆ యువకుడి మెడపై చేతులు వేసి స్టేజి పైనుంచి కిందకు నెట్టివేశారు.

    Bhopal youth praises PM Modi before Digvijaya Singh gets pushed off stage

    ఈ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో నాలుగు విడతల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. మే 12న భోపాల్‌లో పోలింగ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే23న వెలువడనున్నాయి.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+