Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం..

గుజరాత్ కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆచార్య దేవదూత్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఇతరులు హాజరయ్యారు. విజయ్ రుపానీ సీఎం పదవీకి రాజీనామా చేయడంతో.. భూపేంద్రను కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు.

భూపేంద్ర పటేల్ గుజరాత్ 17వ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పటేల్ తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నిక కాగా.. ఆయన సీఎం పదవీ రేసులో ఉంటారని అంతా అనుకోలేదు. వచ్చే ఏడాది ఎన్నిక జరగనున్న నేపథ్యంలో సీఎం పదవీ మార్చడం చర్చానీయాంశమైంది. పదవీ ప్రమాణ స్వీకారానికి నరేంద్ర సింగ్ తోమర్, మాన్సుక్ మాండవీయ, ప్రహ్లాద్ జోషి హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం కోసం రాజ్ భవన్ వచ్చేముందు.. అహ్మాదాబాద్‌లో గల స్వామి నారాయణ్ ఆలయంలో పటేల్ గో పూజ చేశారు.

గుజరాత్‌లో 2017లో తొలిసారిగా బీజేపీ ఎమ్మెల్యేగా గెలిచిన భూపేంద్ర పటేల్‌ను అదృష్టం వరించింది. ఆదివారం సమావేశమైన బీజేపీ శాసనసభా పక్షం ఆయనను తమ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 182 స్థానాలుండగా, 112 మంది బీజేపీ సభ్యులు ఉన్నారు. శాసనసభా పక్ష సమావేశానికి వీరంతా హాజరయ్యారు. తదుపరి సీఎంగా భూపేంద్ర పటేల్‌ పేరును శనివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విజయ్‌ రూపానీ ప్రతిపాదించారు. ఇందుకు బీజేపీ ఎమ్మెల్యేలంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు.

Bhupendra Patel sworn in as new chief minister of gujarat

శాసనసభా పక్ష సమావేశానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్ర మంత్రులు నరేంద్రసింగ్‌ తోమర్, ప్రహ్లాద్‌ జోషీ, సీనియర్‌ నేత తరుణ్‌ చుగ్‌ హాజరయ్యారు. కొత్త సీఎంగా భూపేంద్ర పటేల్‌ ఎన్నికతో రూపానీ వారసుడు ఎవరన్న దానిపై సస్పెన్స్‌కు తెరపడింది. భూపేంద్ర పటేల్‌ ఆదివారం సాయంత్రం గుజరాత్‌ గవర్నర్‌ ఆచార్య దేవవ్రత్‌ను కలిశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయనకు తెలియజేశారు.

సీఎంగా ఎంపిక చేసినందుకు గాను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షా, బీజేపీ అధ్యక్షుడు జె.పి.నడ్డాకు భూపేంద్ర పటేల్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. మాజీ సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ ఆశీస్సులు తనకు ఎల్లప్పుడూ ఉంటాయని అన్నారు. విజయ్‌ రూపానీ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తామని ఉద్ఘాటించారు. భూపేంద్ర పటేల్‌కు కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డా అభినందనలు తెలిపారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో, భూపేంద్ర నాయకత్వంలో గుజరాత్‌ అభివృద్ధికి కొత్త ఉత్సాహం, ఊతం లభిస్తాయని అమిత్‌ షా ఆశాభావం వ్యక్తం చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+