గుజరాత్ సీఎంగా భూపేంద్ర పటేల్ ప్రమాణం: వేదికపై ప్రధాని మోడీ, మంత్రులు, సీఎంలు

గాంధీనగర్: గుజరాత్ ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ నేత భూపేంద్ర పటేల్ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా ఆయన వరుసగా రెండోసారి ప్రమాణం చేయడం గమనార్హం. గాంధీనగర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, సీఎంలు, ప్రముఖులు హాజరయ్యారు.

కొత్త సచివాలయం సమీపంలోని హెలిప్యాడ్ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆచార్య దేవవ్రత్ 18వ ముఖ్యమంత్రిగా పటేల్‌తో ప్రమాణం చేయించారు. గుజరాత్ కేబినెట్‌లో బీజేపీ నేతలు హర్ష సంఘవి, జగదీష్ విశ్వకర్మ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

 Bhupendra Patel Takes Oath As Gujarat CM For 2nd Term, PM Modi, Union ministers, CMs Take Part In Ceremony

గుజరాత్ కేబినెట్‌లో బీజేపీ నేతలు నరేష్ పటేల్, బచుభాయ్ ఖబద్, పర్షోత్తమ్ సోలంకి కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఎంపీ సీఎం శివరాజ్ చౌహాన్, కర్ణాటక సీఎం బస్వరాజ్ బొమ్మై, అస్సాం సీఎం హిమతా బిస్వా శర్మ, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ ధామి, త్రిపుర సీఎం మాణిక్ సాహా తదితరులు హాజరయ్యారు.


డిసెంబరు 8న జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌లో 182 మంది సభ్యుల సభలో రికార్డు స్థాయిలో 156 సీట్లు గెలుచుకోవడం ద్వారా బీజేపీ వరుసగా ఏడవసారి అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌ 17, ఆప్‌ 5 స్థానాల్లో విజయం సాధించాయి.

ఎన్నికల ఫలితాల తర్వాత కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం సుగమం చేసేందుకు 60 ఏళ్ల పటేల్ శుక్రవారం తన మొత్తం మంత్రివర్గంతో కలిసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.

శనివారం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఎన్నికైన భూపేంద్ర పటేల్, గవర్నర్‌ను కలిసి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాగా, పటేల్ ఘట్లోడియా స్థానంలో అత్యధికంగా 1.92 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+