Budget 2026: బడ్జెట్ లో ఆదాయపు పన్నుపై గుడ్ న్యూస్ చెప్తారా ? ఉత్కంఠ..!
ఈసారి కేంద్ర బడ్జెట్ కు గడువు దగ్గరపడుతోంది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ పై ఇప్పటికే ఆర్ధికమంత్రిత్వశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో ఈసారి కూడా ఆదాయపన్ను విషయంలోవేతన జీవులతో పాటు ఇతర వర్గాలు కూడా కేంద్రం వైఫు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈసారి ఆదాయపు పన్ను స్లాబ్ లలో ఉండబోయే మార్పులేంటి ?, ఇతర మార్పులేంటి, వీటి వల్ల తమకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా లేదా అని వారు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
వాస్తవానికి గతేడాది కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్నుకు సంబంధించి పలు కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. పన్ను చెల్లింపుకు కనీస ఆదాయంగా ఉన్న 7 లక్షల స్లాబ్ ను కాస్తా ఏకంగా 12 లక్షలకు పెంచేశారు. అలాగే స్లాబ్ లలోనూ పలు మార్పులు చేశారు. రిబేట్ లోనూ మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తంగా పాత పన్ను విధానం కొనసాగిస్తూనే కొత్త పన్ను విధానం వైపు పన్ను చెల్లింపుదారుల్ని మళ్లించేందుకు ఏం చేయాలో నిర్మలా సీతారామన్ అంతా చేశారు.

ఆ తర్వాత ఆదాయపు పన్ను చట్టంలోనూ సవరణలు చేసి కొత్త చట్టాన్ని తీసుకొచ్చారు. దీంతో ఈసారి కేంద్ర బడ్జెట్ లో ఆదాయపు పన్ను చట్టం విషయంలో పెద్దగా మార్పులు, చేర్పులు ఉండకపోవచ్చని నిపుణులు చెప్తున్నారు. ఉన్నా పరిమితంగానే ఉంటాయని వారు భావిస్తున్నారు. డిమాండ్‌కు సంబంధించిన డేటాలో కనిపిస్తున్నట్లుగా జీఎస్టీ స్లాబ్ ల క్రమబద్ధీకరణ వినియోగదారుల నమ్మకాన్ని పునరుద్ధరించిందని నిపుణులు భావిస్తున్నారు.ప్రభుత్వం ఈ ఊపును కొనసాగించాలని, విధానపరమైన అవాంతరాలను నివారించాలని వారు కోరుతున్నారు.












Click it and Unblock the Notifications